తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly) భాగంగా గురువారం రాష్ట్ర విద్యుత్ రంగం (Power Sector) పరిస్థితిపై చర్చ నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగ పరిస్థితిపై బుధువారం శ్వేత పత్రం విడుదల చేయగా..దీనిపై అధికార విపక్షాలు ఢీ అంటే ఢీ అనేలా చర్చ నడుస్తుంది. గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా, రాష్ట్ర విద్యుత్ సంస్థలు 81,516 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నాయని, మరో రూ.50,275 కోట్ల నష్టాల్లో కూరుకుపోయాయని గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర సర్కార్ తెలిపిన విషయం తెలిసిందే.. అప్పులు, నష్టాలతో పాటు కరెంట్ సరఫరా, కొనుగోళ్లు, ఉత్పత్తి, ఉత్పత్తి కేంద్రాలు సహా అన్ని అంశాలను శ్వేతపత్రంలో పొందుపరిచారు.
ప్రభుత్వం వెల్లడించిన లెక్కలపై గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్ రెడ్డి (Jagadeesh Reddy) స్పందించారు. తమ ప్రభుత్వ హయాంలో అప్పులు తెచ్చి ఆస్తులు పెంచామని స్పష్టంచేశారు. వ్యవస్థలను బలోపేతం చేశామన్నారు. దేశంలో 24 గంటల కరెంట్ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ ఈ విషయం చెప్పిందన్నారు. గతంలో ట్రాన్స్ మిషన్ వ్యవస్థ సరిగా ఉండేది కాదన్నారు. కానీ బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ సరఫరా వ్యవస్థలను బలోపేతం చేశామన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఛతీస్ గడ్ తో గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్తు ఒప్పందం లోభయిష్టగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీ ఆరోపించారు. ఈ ఒప్పందాల వెనుక ఉన్న ఉద్దేశాలు బయటకు రావాలి. చ్చత్తీస్గఢ్ ఒప్పందం , యాదాద్రి , భద్రాద్రి ప్రాజెక్ట్ లలో ఒప్పందాలపై ఇచ్చారని చేసి వాస్తవాలు బయటపెడతాం. 24 నెలల్లో పూర్తి చేస్తామని ఒప్పందం చేసి , ఇంకా పూర్తి చేయలేదు. ఒప్పందాలతో ఇండియా బుల్స్ కంపెనీ కి లాభం చేకూర్చారని రేవంత్ అన్నారు. అలాగే విద్యుత్ రంగానికి సంబదించిన మూడు అంశాలపై పూర్తి స్థాయిలో జ్యుడీషియల్ విచారణ చేయాలనీ రేవంత్ ఆదేశాలు జారీ చేసారు. గత ప్రభుత్వంలో విద్యుతు మంత్రి గా ఉన్న జగదీష్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నామని , విద్యుత్ శాఖలో స్కామ్ లపై విచారణ చేయిస్తాం. ఛతీస్ గడ్ తో చేసుకున్న ఒప్పందాలపై విచారణ చేయిస్తాం..అని రేవంత్ అన్నారు.
Read Also : Allu Arjun: అల్లు అర్జున్ తో సందీప్ వంగా మూవీ, లేటెస్ట్ అప్డేట్ ఇదే