Site icon HashtagU Telugu

CM Revanth Reddy: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం ఢిల్లీలో పర్యటిస్తున్నది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు మరియు రోడ్ల స్థితి గతులపై కేంద్ర మంత్రులతో చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు.

తెలంగాణలోని 15 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి, హైదరాబాద్-శ్రీశైలం నాలుగు లైన్ల ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్-కల్వకుర్తి రోడ్డు నాలుగు లేన్లుగా, రీజినల్ రింగ్ రోడ్ (RRR) అభివృద్ధిపై గడ్కరీతో చర్చించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ఆరు లేన్లుగా. సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి తెలంగాణకు నిధుల కేటాయింపు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

నల్గొండలో రవాణా శిక్షణా సంస్థ ఏర్పాటు చేయాలని, నల్గొండ పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని కోమటిరెడ్డి వెంకట రెడ్డి నితిన్ గడ్కరీకి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.

Also Read: Tamilisai: గవర్నర్ కు షాకిచ్చిన హ్యాకర్లు.. మరోసారి సోషల్ మీడియా ఖాతా హ్యక్