CM Revanth Lok Sabha Campaign : కేసీఆర్.. దమ్ముంటే మా ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడు..మాడి మసైపోతావ్ – రేవంత్

కేసీఆర్.. నీకు దమ్ముంటే ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడు... ఎమ్మెల్యేలకు ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్‌రెడ్డి అని, వాళ్లని ముట్టుకుంటే మాడి మసైపోతావని హెచ్చరించారు

  • Written By:
  • Updated On - April 19, 2024 / 05:10 PM IST

తెలంగాణ లో లోక్ సభ ఎన్నికలకు (Lok Sabha Elections) సంబదించి నామినేషన్ల పర్వం మొదలుకావడం తో పార్టీల అధినేతలు , ముఖ్య నేతలు ప్రచారంలోకి దిగుతున్నారు. సరిగ్గా 23 రోజుల సమయం మాత్రమే ఉండడం తో ఉన్న ఈ కొద్దీ రోజుల్లోనే ఎంత వీలైతే అంత గట్టిగా ప్రచారం చేయాలనీ చూస్తున్నారు. ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ ను ఓడించాలని బిఆర్ఎస్ , బిజెపి చూస్తుంటే..కాంగ్రెస్ మాత్రం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలనీ చూస్తున్నారు. ఈ తరుణంలో ఇరు అగ్ర నేతలు పోటాపోటీగా సవాల్ , ప్రతి సవాల్ చేసుకుంటూ ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నారు.

నిన్న గురువారం తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్..లోక్ సభ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసి..కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని..ఇప్పుడంటే ఇప్పుడు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని..బిఆర్ఎస్ నుండి పోయిన నేతలు ఇప్పుడు బాధపడుతున్నారంటూ పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ (CM Revanth Reddy) ఘాటుగా స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి (Challa Vamshi Chand Reddy)కి మద్దతుగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు రోడ్డు షో లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్.. నీకు దమ్ముంటే ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడు… ఎమ్మెల్యేలకు ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్‌రెడ్డి అని, వాళ్లని ముట్టుకుంటే మాడి మసైపోతావని హెచ్చరించారు. కారు.. షెడ్డు నుంచి బయటకు రాదని పాడైపోయిందని ఎద్దేవా చేసారు. పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారా అని ప్రశ్నించారు. పార్లమెంటులో నిద్రపోవడానికి బీఆర్ఎస్‌కు ఓటు వేయాలా అంటూ ప్రశ్నించారు. పాలమూరును కేసీఆర్ నిర్లక్ష్యం చేశాడని… పాలమూరు లిప్ట్ ను కూడా పూర్తి చేయలేదన్నారు. గతంలో పాలమూరుకు మంత్రి పదవులు కూడా దక్కలేదని.. డీకే అరుణ కూడా ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని విమర్శించారు. పాలమూరు అభివృద్ధి కావలంటే 2 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ గెలిపించాలని కోరారు. వంశీచంద్ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలన్నారు. అనంతరం చల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ రవినాయక్ కు రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్‌ కార్యక్రమంలో సీఎం రేవంత్​ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Read Also : AP Eelctions 2024: 6 స్థానాల్లో పోలింగ్ సమయం మార్పు.. ఎందుకంటే?