డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల (Double Bed Room Houses ) పేరుతో కేసీఆర్ (KCR) పదేళ్లు మోసం చేసాడని, పేదల కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తీవ్రంగా ధ్వజమెత్తారు. సోమవారం భద్రాచలంలో ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Housing Scheme) ఆయన ప్రారంభించారు. ముందుగా భద్రాచలం (Bhadrachalam) స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్న రేవంత్..ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్నిప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు.
భద్రాచలం స్వామివారి ఆశీర్వాదం తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించామని తెలిపారు. బడుగుల ఆత్మగౌరవమే ఇందిరమ్మ ఇళ్లు అని అన్నారు. పేదల కష్టాలు చూసి ఆనాడు ఇందిగాంధీ ఈ ఇళ్లు పథకం ప్రారంభించారని గుర్తు చేశారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లేనన్నారు. ఇంటి నిర్వహణ మహిళ చేతిలో ఉంటే ఆ ఇళ్లు బాగుంటుందని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో బీఆర్ఎస్ పదేళ్లు మోసం చేసిందని, పేదల కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. తమ పాలనలో అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని, ఇళ్లు ఉన్న చోట కాంగ్రెస్‌కు ఓటు వేయాలని సీఎం కోరారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(PM Awas Yojana) కింద పేదలకు ఇళ్లు కట్టిస్తామని ప్రధాని చెప్పారన్న ఆయన, ఆ పథకం ద్వారా తెలంగాణలో ఎక్కడ ఇళ్లు కట్టారో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర కోసం పోరాడుతున్న రైతులపై తుపాకీలు ఎక్కుపెడుతున్నారని విమర్శించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధాని, భర్తీలే కానీ పూరించివుంటే ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఉండదు కదా అని ప్రశ్నించారు.
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కింద లబ్దిదారులకు సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, నిరుపేదలకు స్థలంతో పాటు ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వనుంది. ఈ స్కీమ్ తొలి విడతలో భాగంగా ప్రభుత్వం ప్రతినియోజవర్గంలో 3500 ఇళ్లను నిర్మించనుంది అని సీఎం రేవంత్ తెలిపారు.
Read Also : Karnataka: రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర: సిద్ధరామయ్య