Site icon HashtagU Telugu

CM Revanth : కుటుంబ సమేతంగా ఓటు వేసిన సీఎం రేవంత్, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు

Cm Revanth Kcr Ktr Voting Min

Cm Revanth Kcr Ktr Voting Min

CM Revanth : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఘట్టం కొనసాగుతోంది. ఇవాళ ఎండల తీవ్రత కూడా తక్కువగానే ఉండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయడానికి పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు. కొడంగల్‌లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రంలో కుటుంబసమేతంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth) ఓటు వేశారు.

We’re now on WhatsApp. Click to Join

Also Read :AP Elections : భారీ పోలింగ్ దిశగా ఏపీ.. 2 గంటల్లోనే పది శాతం ఓటింగ్

హరీష్ రావు పిలుపు

ఓటు వేసిన అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. ‘‘గతం కంటే ఈసారి రాష్ట్రంలోని పట్టణాలలో ఎక్కువగా పోలింగ్ జరుగుతోంది. ప్రశ్నించే గొంతుక ఉండాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజాస్వామ్యం బలపడాలంటే అందరూ ఓటింగ్‌లో పాల్గొనాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు.

ఓటు వేశాకే.. ఇతర పనులు చూసుకోవాలి : సజ్జనార్

ఓటు వేసిన అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ.. ‘‘భారత రాజ్యాంగం కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమానంగా ఓటు వేసే  హక్కును కల్పించింది. సమర్థ నాయకులను ఎన్నుకునేందుకు ఇది గొప్ప అవకాశం. ప్రజలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలి. ముందు ఓటు వేసి.. ఆ తర్వాతే ఇతర పనులు చూసుకోవాలి.  ఓటు వేసేందుకు  సొంతూళ్లకు వెళ్లేవారి కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో 1.50 కోట్ల మంది బస్సుల్లో రాకపోకలు సాగించారు’’ అని వెల్లడించారు.

Also Read : NTR Shirt Colour: వైసీపీ పార్టీ కోసం ఎన్టీఆర్ ప్రచారం.. చొక్కా వైరల్