CM Revanth Karimnagar Tour : సీఎం రేవంత్ కరీంనగర్ టూర్ రద్దు

ఈరోజు కరీంనగర్ (CM Revanth Karimnagar Tour) లో పర్యటించాల్సి ఉండగా..భారీ వర్షం (Rain), ఈదురుగాలులు కారణంగా ఈ పర్యటన రద్దయింది

  • Written By:
  • Publish Date - May 7, 2024 / 07:13 PM IST

లోక్ సభ ఎన్నికల (Telangana Lok Sabha Elections) ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth ) ఈరోజు కరీంనగర్ (CM Revanth Karimnagar Tour) లో పర్యటించాల్సి ఉండగా..భారీ వర్షం (Rain), ఈదురుగాలులు కారణంగా ఈ పర్యటన రద్దయింది. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం చల్లబడింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా వర్షం కురవడం ప్రారంభమైంది.

We’re now on WhatsApp. Click to Join.

కొన్నిరోజులుగా ఎండవేడితో తాళలేకపోతున్న ప్రజలకు ఈ వర్షంతో ఉపశమనం లభించింది. పలు ప్రాంతాల్లో సాయంత్రం ఐదు గంటలకే చీకట్లు అలుముకున్నాయి. తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, కుమురంబీమ్ అసిఫాబాద్, ములుగు, జనగామ, ఖమ్మం, వరంగల్ , హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. కరీంనగర్ లో కురిసిన భారీ వర్షానికి రేవంత్ సభ రద్దయింది. ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న తరుణంలో అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఒక్కసారిగా భారీ ఈదురు గాలులు వీచి టెంట్లు నేలవాలాయి. కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. వర్షం కారణంగా రేవంత్ కరీంనగర్ పర్యటన రద్దు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు బయలుదేరారు. వర్షం వల్ల కరీంనగర్ పర్యటన రద్దు చేసుకున్నా వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ రోడ్ షోలకు సీఎం రేవంత్ యథావిథిగా హాజరుకానున్నారు.

Read Also : 666 Crores Jewels : రూ.666 కోట్ల బంగారు ఆభరణాల కంటెయినర్ బోల్తా.. ఏమైందంటే ?