Site icon HashtagU Telugu

Hand Cuffs : రైతుకు సంకేళ్లు వేయడం ఫై సీఎం రేవంత్ సీరియస్

Cm Revanth Is Serious About

Cm Revanth Is Serious About

కొంతమంది పోలీస్ అధికారులు (Police officers) , ప్రభుత్వ అధికారులు(Government officials) చేసే పనులు , తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వం (కాంగ్రెస్ Govt) విమర్శలు ఎదురుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ నేతలు కాచుకొని కూర్చుంటున్నారు. ప్రభుత్వ అధికారులు ఏ చిన్న తప్పు చేసిన దానిపై పెద్ద ఎత్తున రగడ చేస్తూ ప్రభుత్వాన్ని అభాసుపాలుచేస్తున్నారు. తాజాగా లగచర్ల రైతుకు సంకేళ్లు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లిన ఘటన పై బిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులపై దాడులకు పాల్పడ్డరాన్న నెపంతో లగచర్లకు(Lagacharla ) చెందిన రైతు హీర్యానాయక్‌తో పాటు మరికొందరు రైతులను (Heeryanaik) అరెస్టు చేసి జైలులో ఉంచి విషయం తెలిసిందే.

కాగా హీర్యానాయక్‌కు గురువారం గుండె సమస్యరావడంతో అతడికి సంకెళ్ళ తోనే (Hand Cuffs) జైలు సిబ్బంది సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి 2డీ ఈకో పరీక్షలు నిర్వహించారు. సంకెళ్లు వేసి తీసుకురావడం భావ్యంకాదని గతంలో కోర్టులు తీర్పు చెప్పినా కూడా పోలీసులు రైతు హీర్యానాయక్‌కు సంకెళ్లు వేయడం పట్ల బిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా లో పోస్టులు పెట్టింది. దీనిపై ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం సీఎం రేవంత్ (CM Revanth) దృష్టికి వెళ్లడంతో సంబంధిత పోలీస్ అధికారులపై సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి, నివేదిక సమర్పించాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.

Read Also : 2024 -25 INCOME TAX Records : FY25లో ట్యాక్స్ రీఫండ్ చెల్లింపుల్లో సరికొత్త రికార్డ్