జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills Bypoll) నేపథ్యంలో రాజకీయ పావులు వేగంగా కదులుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం విస్తృత స్థాయి ప్రచారానికి రూపురేఖలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచార రంగంలోకి దిగుతున్నారు. అక్టోబర్ 31 నుంచి ప్రచార యాత్రలు ప్రారంభించి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కీలక ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కానున్నారు.
NASA: మౌంట్ ఎవరెస్ట్‌పై చర్చ.. అంతరిక్షం నుండి అద్భుత దృశ్యాలు!
ప్రచార షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 31న వెంగళరావు నగర్, సోమాజీగూడ ప్రాంతాల్లో సభలు, ప్రజాసమావేశాలు నిర్వహించనున్నారు. నవంబర్ 1న బోరబండ, ఎర్రగడ్డ ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సెపరేట్ మీట్లు చేసేందుకు సిద్ధమయ్యారు. అనంతరం నవంబర్ 4న షేక్‌పేట్-1, రహమత్‌నగర్, నవంబర్ 5న షేక్‌పేట్-2, యూసుఫ్‌గూడ ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రతి రోజు రాత్రి 7 గంటల తర్వాత ప్రజలతో సమావేశం అయ్యేలా ప్లాన్ చేశారు.
ఇక నవంబర్ 8, 9 తేదీల్లో భారీ మోటార్ సైకిల్ ర్యాలీలను కూడా చేపట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. యువతను ఆకర్షించేందుకు, ప్రచారాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చేందుకు ఈ ర్యాలీలను కీలకంగా చూస్తున్నారు. అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు పార్టీ ప్రతిష్టకే సంబంధించినదిగా భావిస్తున్న కాంగ్రెస్, అందుకు తగ్గట్టే నేతలందరినీ రంగంలోకి దించుతోంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా తమ వ్యూహాలను బలోపేతం చేస్తుండడంతో, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కరాటే పోరుకు సమానంగా మారనుంది.
