Site icon HashtagU Telugu

CM Revanth: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. మూడు రోజుల‌పాటు అక్క‌డే..?!

CM Revanth

CM Revanth

CM Revanth: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఫుల్ బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు. మొన్న‌టివ‌ర‌కు విదేశాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లి వ‌చ్చిన సీఎం రేవంత్‌.. నిన్న వైరాలో భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసి మూడో విడ‌త రైతుల రుణ మాఫీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. గురువారం రాత్రి సీఎం రేవంత్ ఢిల్లీ చేరుకున్నారు. విదేశీ పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలతో ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి స‌మావేశం కానున్న‌ట్లు స‌మాచారం.

ఈ రోజు ఢిల్లీలో ఫాక్స్ కాన్-యాపిల్ మ్యాన్యుఫాక్చరర్స్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సమావేశం కానున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవ‌ల‌ విదేశీ పర్యటన చేసిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. స్వదేశంలోనూ అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నారు.

Also Read: Gruha Jyoti Scheme : మీకు ఫ్రీ కరెంట్ రావడం లేదా..అయితే అప్లై చేసుకోవచ్చు – భట్టి

తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయమంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫాక్స్ కాన్-యాపిల్ మ్యాన్యుఫాక్చరర్స్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలను క‌లిసే అవ‌కాశం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై అధిష్టానం పెద్దలతో చర్చించనున్నారు సీఎం రేవంత్.

ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన అంశాన్ని అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకెళ్ల‌నున్నారు. వరంగల్ లో రైతు కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని సీఎం ఆహ్వానించ‌నున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఓపెనింగ్ కార్యక్రమానికి సోనియాను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే సీఎం రేవంత్ రెండు మూడు రోజులు ఢిల్లీలోనే ఉండే అవ‌కాశం ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

నూతన పీసీసీ అధ్యక్షులు, మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో చ‌ర్చించ‌నున్నారు. ఇప్పటికే అధిష్టానం పెద్దలతో వారి వారి పదవుల కోసం తీవ్ర మంతనాలు జరిపిన ఆశావాహులు. అధిష్టానం ఆశీర్వాదం మా కంటే మాకే ఉందంటూ ఆశావాహులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా ఆశావాహుల ఎదురుచూపులకు ఫలితం దక్కుతుందా? లేదా తెలియాల్సి ఉంది. ఈ క్ర‌మంలోనే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంద‌ని స‌మాచారం.