Osmania Hospital : హైదరాబాద్‌లోనే చాలా పాతదైన ఉస్మానియా హాస్పిటల్‌కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆ హాస్పిటల్‌ను గోషామహల్‌కు తరలించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించి భూ బదలాయింపు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్కిటెక్టులను సంప్రదించి ఉస్మానియా నయా ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను రూపొందించాలని రేవంత్ నిర్దేశించారు. ఇవాళ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈవిషయాన్ని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
వచ్చే యాభై ఏళ్లను దృష్టిలో ఉంచుకొని అధునాతన వసతులతో సౌకర్యవంతంగా ఉస్మానియా ఆస్పత్రిని(Osmania Hospital) నిర్మిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. ఆ మేరకు ప్రణాళికలను సిద్ధం చేసి తనకు సమర్పించాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులోనూ ఆస్పత్రికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డిజైనింగ్ ఉండేలా చూడాలన్నారు. ఉస్మానియా ఆస్పత్రి పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, దానికి రోడ్ కనెక్టివిటీ సరిగ్గా ఉండేలా ప్రణాళికలు ఉండాలని రేవంత్ తెలిపారు. ఇక గోషామహల్‌లోని సిటీ పోలీస్ అకాడమీకి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని అధికారులకు ఆర్డర్స్ ఇచ్చారు.
Also Read :Akbaruddin Owaisi : రంగంలోకి ‘హైడ్రా’ అధికారులు.. ఫాతిమా ఒవైసీ ఉమెన్స్ కాలేజీని కూల్చేస్తారా ?
హైదరాబాద్‌లో కబ్జాలు, అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టేందుకు హైడ్రా విభాగాన్ని సీఎం రేవంత్ జులైలో ప్రారంభించారు. తద్వారా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడానికి సీఎం రేవంత్ చొరవ చూపారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, లోటస్ పాండ్, మాదాపూర్ వంటి ఉన్నత ప్రాంతాల్లోని 18 చోట్ల 48 ఎకరాల ఆక్రమణలను హైడ్రా ఇప్పటివరకు కూల్చివేసింది. ఇటీవలే నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌కు కూడా హైడ్రా కూల్చేసింది. ఈనేపథ్యంలో హైడ్రాకు ప్రజల మద్దతు పెరుగుతోంది. హైడ్రా లాంటి విభాగాలను రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లోనూ ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈనేపథ్యంలో రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాపులారిటీ బాగా పెరిగిపోయింది. హైడ్రా పారదర్శకంగా పనిచేస్తుండటం, రైతుల రుణమాఫీ అమలు వంటి అంశాలతో రేవంత్‌కు ప్రజల్లో చాలా మంచిపేరు వచ్చింది.