Ration Card : రేషన్ కార్డు దారులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్…

అతి త్వరలో కొత్త రేషన్ కార్డుస్ అందజేస్తామని..అలాగే సన్నబియ్యం పండించే రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు

  • Written By:
  • Publish Date - July 5, 2024 / 10:05 AM IST

రేషన్ కార్డు దారులకు (Ration Card Holders) సీఎం రేవంత్ (CM Revanth )గుడ్ న్యూస్ అందించారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుస్ ఇవ్వకపోవడం తో చాలామంది నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం రేషన్ కార్డు ఎంత ఉపయోగకరంగా మారిందో తెలియంది కాదు. రేషన్ కార్డు తోనే ప్రభుత్వ పథకాలు అందుతుండడం తో ఈ రేషన్ కార్డ్స్ లేకపోవడం తో ప్రభుత్వ పథకాల కోసం ఎదురుచూస్తున్నవారు నిరాశ చెందుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డ్స్ మంజూరు చేస్తామని , అలాగే రేషన్ దారులకు సన్నబియ్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే ఇప్పుడు కొత్త రేషన్ కార్డు లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఇదే విషయాన్నీ సీఎం రేవంత్ తెలిపారు. అతి త్వరలో కొత్త రేషన్ కార్డుస్ అందజేస్తామని..అలాగే సన్నబియ్యం పండించే రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు. రైతులు పండించిన సన్నబియ్యాన్ని మిల్లింగ్ చేయించి.. రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అందజేస్తామని వెల్లడించారు. రైస్ వినియోగదారులే తింటారు కాబట్టి..రీసైక్లింగ్ ఆగిపోయే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్..రైతులందరికీ 2 లక్షల రుణ మాఫీని చేసే పనిలో బిజీ గా ఉంది. ఇప్పటికే దీనికి సంబదించిన వివరాలను సీఎం రేవంత్ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఆగస్టు 15 లోగా రైతులకు రుణమాఫీ చేస్తామని మొదటి నుండి చెపుతూ వస్తుంది. ఒకే దఫాలో అందరికి మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మాఫీ కోసం రైతులంతా ఎప్పటి నుండి ఎదురుచూస్తున్నారు.

Read Also : Rave Party : అడ్డంగా దొరికిన జబర్దస్త్ ఫేమ్ రోహిణి ..?