Site icon HashtagU Telugu

CM Revanth Flight Emergency Landing : సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం..

Cm Revanth Reddy Flight Eme

Cm Revanth Reddy Flight Eme

సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానం (CM Revanth Flight Emergency Landing)లో సాంకేతిక లోపం (Technical Error) తలెత్తడంతో గంట నుండి ఆయన విమానంలోనే ఉండాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన రాహుల్ న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) ఈరోజు తో పూర్తి అయ్యింది. ఈ క్రమంలో ముంబై లో పెద్ద ఎత్తున భారీ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభకు హాజరారైందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి తో పాటు దీపాదాస్ మున్షీ, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ తదితరులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి మధ్యాహ్నం 2.30గంటకు ఫ్లైట్ నంబర్ 6e 5099 ఇండిగో విమానం ఎక్కారు.

We’re now on WhatsApp. Click to Join.

కానీ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే మళ్లీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు పైలట్. వెంటనే అక్కడికి చేరుకున్న టెక్నికల్ టీమ్ ఇంజిన్ ఐసీయులో సమస్య తలెత్తినట్లు గుర్తించారు. ఇంజన్ వేడెక్కడంతో ఈ సమస్య వచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో గంట సేపు వరకు రేవంత్‌, భట్టి, టీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షి విమానంలోనే ఉండిపోయారు. రిపేర్ అనంతరం మళ్లీ టేకప్ అయిన విమానం ముంబైకి వెళ్ళిపోయింది. ఇక సార్వత్రిక ఎన్నికల సమరానికి విపక్ష ఇండియా కూటమి సిద్ధమైంది. నేడు ముంబయిలో జరిగే రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ముగింపు సభలో ఎన్నికల శంఖరావం పూరించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో విపక్ష ఇండియా కూటమి సమరానికి సిద్ధమైంది. దేశంలో అధికార మార్పే ప్రధాన ఎన్నికల నినాదంగా నేడు ముంబయిలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఎన్డీఏ కూటమిని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష ఇండియా కూటమి ఐక్యంగా పనిచేయాలని సంకల్పించింది.

విపక్ష కూటమి బలాన్ని చాటేందుకు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభనే వేదికగా చేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ భావించింది. ఇక కూటమి పార్టీలు కూడా కాంగ్రెస్​అభిప్రాయానికి జై కొట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు భారత్‌ జోడో న్యాయ్ యాత్ర ముంబయిలో ముగుస్తుండగా.. ముగింపు సభతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ సభకు ప్రాంతీయ పార్టీల దిగ్గజ నేతలను ఆహ్వానించింది. 6,700 కిలోమీటర్లపాటు సాగిన రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ముంబయిలో ముగియనున్న వేళ దానినే ఎన్నికల శంఖారావ సభకు వినియోగించుకోవాలని విపక్ష ఇండియా కూటమి నేతలు భావించారు.

Read Also : IPL 2024: సన్‌రైజర్స్ శిబిరంలో ట్రావిస్ హెడ్