CM Revanth First International Tour : ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనబోతున్న సీఎం రేవంత్ రెడ్డి

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తొలి విదేశీ పర్యటన (First International Tour) చేయబోతున్నాడు. జనవరి 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్‌లో జరిగే దావోస్ (Davos ) ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridar Babu), అధికారులు వెళ్లనున్నారు. ఈ సదస్సుల్లో తెలంగాణలో ఉన్న అవకాశాలు, […]

Published By: HashtagU Telugu Desk
Revanthdavos

Revanthdavos

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తొలి విదేశీ పర్యటన (First International Tour) చేయబోతున్నాడు. జనవరి 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్‌లో జరిగే దావోస్ (Davos ) ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridar Babu), అధికారులు వెళ్లనున్నారు. ఈ సదస్సుల్లో తెలంగాణలో ఉన్న అవకాశాలు, పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వారికి వివరించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ ఇప్పటికే చాలా సంస్థలు పెట్టుబడి పెట్టగా.. ఆయా సంస్థల ప్రతినిధులతోనూ తెలంగాణ ప్రతినిధుల బృందం భేటీ కానుంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని వారిని కోరనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో వంద దేశాలకు చెందిన రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు పాల్గొంటారు. ఈసారి ల్యాబ్ నుంచి లైఫ్ టు లైఫ్ – సైన్స్ ఇన్ యాక్షన్ అనే అంశంతో ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సదస్సులో దేశంలోని కేంద్రమంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, అధికారులు పాల్గొంటారు.

గత పదేళ్లలో హైదరాబాద్ నగరం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఎన్నో సంస్థలు నగరంలో కార్యాలయాలను ప్రారంభించి, భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. ఈ అభివృద్ధిని కొనసాగించాల్సిన బాధ్యత రేవంత్ ప్రభుత్వం ఫై ఎంతైనా ఉంది. తాము నగరాభివృద్ధిని కట్టుబడి ఉన్నామని.. రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అందుకే విదేశీ పర్యటనలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకరావాలని రేవంత్ భావిస్తున్నారు.

Read Also : OnePlus Nord 3: వన్‌ప్లస్ ఫోన్‌పై భారీగా డిస్కౌంట్.. ఈ అవకాశం అస్సలు మిస్సవ్వకండి?

  Last Updated: 29 Dec 2023, 03:02 PM IST