Site icon HashtagU Telugu

BRS : సీఎం రేవంత్‌కు మతి భ్రమించిందా?..బీఆర్ఎస్ నేత పుట్ట మధు తీవ్ర విమర్శలు

CM Revanth delirious?.. BRS leader Putta Madhu strongly criticizes him

CM Revanth delirious?.. BRS leader Putta Madhu strongly criticizes him

BRS : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మంథనిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం తీరును ఎండగడుతూ..రేవంత్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయారు. ఆయన తీరూ, మాటలు పిచ్చివాడిలా ఉన్నాయి అంటూ పుట్ట మధు మండిపడ్డారు. అంతేకాకుండా, సీఎం‌తో పాటు మంత్రివర్గం మొత్తం తక్షణమే రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తామంటూ ఈ వ్యక్తిని వెంటనే ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి తరలించాలి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుట్ట మధు వ్యాఖ్యలు ఇక్కడితో ఆగలేదు. సీఎం వ్యక్తిత్వాన్ని స్వయంగా లక్ష్యంగా చేసుకొని మీ ఎత్తు బాగుంది కానీ, దానికి తగిన మెదడు లేదు. అందుకే బుద్ధిగా మాట్లాడలేరు అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు, కాంగ్రెస్ మంత్రివర్గం మొత్తం తెల్లకల్లు తాగిన కోతుల్లా వ్యవహరిస్తోందంటూ ఘాటుగా విమర్శించారు.

Read Also: Viveka Murder Case : వివేకా హత్య కేసు విచారణ మళ్లీ వాయిదా

రాష్ట్రాభివృద్ధికి కీలకమైన ఎల్లంపల్లి ప్రాజెక్టు గురించి సీఎం చేసిన వ్యాఖ్యలపై పుట్ట మధు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “1999లో శ్రీపాదరావు మరణించారు. కానీ ప్రాజెక్టు నిర్మాణం 2004లో ప్రారంభమై 2016లో పూర్తయింది. అలాంటప్పుడు మీరు ఎలా కడతారు?” అంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్‌కు ప్రాజెక్టుల చరిత్రపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మంత్రివర్గంలోని ఇతర నేతలకూ తెలివి లేదంటూ విరుచుకుపడ్డారు. “రేవంత్ రెడ్డి, పొడవుగా ఉన్న హరీశ్ రావును అవహేళన చేశారు. మరి మీకన్నా పొట్టిగా ఉన్న మీ మంత్రుల పరిస్థితి ఏమిటి?” అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం చేసిన వ్యాఖ్యలకు బదులుగా పుట్ట మధు తీవ్రంగా స్పందించారు. కాళేశ్వరం కూలిపోయిందంటావు. అసలు కూలిందేమిటంటే నీ ముఖమే కూలిపోయింది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలు వృథా అవుతుంటే, ప్రభుత్వానికి పట్టదంటూ మండిపడ్డారు.

ప్రస్తుతం పరిస్థితిని బట్టి ప్రభుత్వానికి సూటిగా సూచనలు చేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం తెలివిగా వ్యవహరించాలి. అన్నారం, సుందిల్ల బ్యారేజీలను సమర్థవంతంగా ఉపయోగించి ప్రజలకు సాగునీరు అందించాలి అని సూచించారు. సీఎంను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని చేసిన ఈ వ్యాఖ్యలతో పాటు, మొత్తం ప్రభుత్వ వ్యవస్థనే పుట్ట మధు ప్రశ్నించడాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా చూస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా విపక్షంగా బీఆర్ఎస్ తన దూకుడును మరింత పెంచబోతోందనే సంకేతాలే ఇవి.

Read Also: West Bengal : “అమ్మను మా ఇంటికి పంపించండి”..మమతా బెనర్జీకి ఐదేళ్ల బాలుడి లేఖ