Site icon HashtagU Telugu

CM Revanth : కేటీఆర్ ను ఐటీ ఉద్యోగి అని అనడం తప్పవుతుందా..?

Cmrevanthit

Cmrevanthit

ప్రభుత్వం(Congress Govt )పై ఏదో రకంగా బురద చల్లడం, వార్తల్లో నిలువడం బిఆర్ఎస్ కు అలవాటైపోయింది. ముఖ్యంగా సీఎం రేవంత్ (CM Revanth) వ్యాఖ్యలపై ప్రత్యేక దృష్టి పెడుతూ..ఎప్పటికప్పుడు విమర్శలు, ఆరోపణలు చేయడం చేస్తుంది. తాజాగా మరోసారి అదే చేస్తుంది. ప్రస్తుతం సీఎం రేవంత్ దావోస్ పర్యటన(Davos Tour)లో బిజీ గా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇది చూసి తట్టుకోలేకపోతున్నా బిఆర్ఎస్..తాజాగా రేవంత్ పై ఓ నింద వేసి ఆయన్ను బద్నామ్ చేయాలనీ చూస్తుంది.

Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా.. ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలు పెడతారు?

“కేటీఆర్ (KTR) ఐటీ ఎంప్లాయి.. ఆయన ఐటీ ఎంప్లాయిగానే ఆలోచించి పాలసీలు చేశారు. కానీ పాలసీ మేకర్స్ లాగా ఆలోచించలేదు” అని దావోస్‌లో మీడియా ప్రతినిధి తెలంగాణలో ఐటీ పాలసీలపై సీఎం రేవంత్ ను అడిగినప్పుడు చెప్పిన సమాధానం ఇది. దీనికి కేటీఆర్ ను ఐటీ ఉద్యోగిగా చెప్పడం .. ఐటీ ఎంప్లాయిస్ ను అవమానించడమేనన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై కేటీఆర్ కూడా ఓ పెద్ద ట్వీట్ పెట్టారు. నన్ను ఒక ఐటీ ఉద్యోగి అంటూ తక్కువ చేసి మాట్లాడారని చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులు ఎంతో కష్టపడి వారి జీవనోపాధిని పొందుతున్నారు. ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల్లో ఉన్న నా అక్కాచెల్లెళ్ళకు, అన్నాదమ్ముళ్ళకు సలాం అని ట్వీట్ పెట్టారు. మీ విద్యార్హతలకు, మీ నిబద్ధతకు కొందరు యాక్సిడెంటల్ రాజకీయ నాయకులు సరితూగరు. అలాంటి వాళ్ళు ప్రవేశపట్టే అనాలోచిత విధానాలకు మనం భారీ మూల్యం చెల్లించుకుంటున్నమని… నా విద్యార్హతలు, నా ఉద్యోగ అనుభవం, ఐటీలో నా నేపథ్యం, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగులు నాకు ఎప్పటికి గర్వకారణమని తెలిపాడు.

ఇక కేటీఆర్ చేసిన ట్వీట్ పై ఐటీ ఉద్యోగులు స్పందిస్తూ..సీఎం రేవంత్ అన్నదాంట్లో అవమానం ఏమిలేదు కదా..మీరెందుకు ఆలా ఆలోచిస్తున్నారు అంటూ రివర్స్ లో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో బిఆర్ఎస్ ఏదో చేద్దామని అనుకుంటే ఏదో జరుగుతుందని తలపట్టుకుని పరిస్థితికి వచ్చింది.

Exit mobile version