100 Days Of Congress Ruling : 100 రోజుల్లో సరికొత్త చరిత్ర సృష్టించాం – సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చి చరిత్రను సృష్టించామన్నారు

  • Written By:
  • Publish Date - March 16, 2024 / 02:52 PM IST

కాంగ్రెస్ 100 రోజుల పాలన (Congress Ruling) ఫై సీఎం రేవంత్ (CM Revanth) మీడియా తో సమావేశమయ్యారు. పదేళ్ల పాటు బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వ తీరును చూసిన రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని డిసైడ్ అయ్యి..భారీ మెజార్టీ తో గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము కాకుండా అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేర్చే పని పెట్టుకున్న కాంగ్రెస్ 100 రోజుల్లో కీలక హామీలను నెరవేర్చి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం , ఆరోగ్య శ్రీ పెంపు , 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ , రూ.500 లకే గ్యాస్ సిలెండర్, ఇందిరమ్మ ఇళ్ల వంటివి కీలక హామీలను నెరవేర్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం 100 పాలన ఫై మీడియా తో స్పందించారు. వందరోజుల్లో ప్రజలు చూపించిన సానుభూతి మరువలేనిదని … ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మాట ఇస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు. 8 లక్షల మంది 500 రూపాయలకే సిలిండర్ కొన్నారని.. 37 లక్షల మందికి జీరో బిల్ ఇచ్చామని తెలిపారు. ఎన్నికల కోడ్ వల్ల కొందరికి జీరో బిల్ ఇవ్వలేకపోయామని ..త్వరలోనే వారికీ ఇస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుండే ఆరు గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టామన్నారు. గత పదేండ్లలో కేసీఆర్ ఆర్థిక వ్యవస్థను దిగజార్చారని విమర్శించారు. గత ప్రభుత్వ చిక్కుముడులు ఒక్కక్కటిగా విప్పుతున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చి చరిత్రను సృష్టించామన్నారు. బీఆర్ఎస్​ టీఎస్‌పీఎస్సీని అవినీతికి అడ్డాగా మార్చిందని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రంలో ఒక్క తెలంగాణ ప్రాజెక్టు పూర్తి కాలేదని వివరించారు. గతంలో ఈడీ వచ్చాక మోదీ వచ్చేవని, నిన్న మాత్రం మోదీ, ఈడీ కలిసే వచ్చాయని రేవంత్‌రెడ్డి అన్నారు.

కవిత అరెస్ట్ (Kavitha Arrest) పై కేసీఆర్, ప్రధాని మోడీ ఎందుకు మౌనం – రేవంత్ సూటి ప్రశ్న

ఈ సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ ఎత్తుగడల్లో భాగంగానే ఎమ్మెల్సీ కవితను ఈడీ (ED) అరెస్ట్ చేసిందని ఆరోపించారు. కవితను అరెస్ట్ చేయడం ద్వారా రాష్ట్రంలో ఆ క్రెడిన్ ను ఈ రెండు పార్టీలు పొందాలనుకుంటున్నాయన్నారు. కవితను అరెస్ట్ చేస్తే తండ్రిగా కాకపోయినా పార్టీ అధ్యక్షుడిగానైనా కేసీఆర్ స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. కవిత అరెస్ట్ పై కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 12 సీట్లు వస్తాయని అన్ని సర్వేలు అంచసా వేశాయని.. బీఆర్ఎస్, బీజేపీలు ఓడిపోతామనే భయంతోనే ఈ ఛీప్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. ఇకనైనా ఈ పార్టీలు డ్రామాలకు తెరలేపాలని కోరారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని పడగొడతా అంటున్నారని.. అయితే వారు ప్రభుత్వాన్ని పడగొట్టే పనిలో ఉంటే తాను ప్రభుత్వాన్ని నిలబెట్టే పనిలో ఉంటానని వెల్లడించారు.

Read Also : Lakshmi Devi: ప్రతీరోజు సాయంత్రం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే చాలు.. డబ్బే డబ్బు?