Site icon HashtagU Telugu

CM Revanth Reddy : కేసీఆర్ నాటిన కలుపు మొక్కలను ఏరిపారేస్తున్నాం – సీఎం రేవంత్

Cm Revanth 100day

Cm Revanth 100day

ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోం.. కేసీఆర్ (KCR) నాటిన కలుపు మొక్కలను ఏరిపారేస్తున్నాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఏర్పడి వంద రోజూ అవుతున్న సందర్బంగా వంద రోజుల పాలనపై మీట్ ది ప్రెస్ (CM Revanth Reddy Meet The Media) లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నిబద్దతతో వంద రోజులల్లో పాలన పూర్తి చేశామని, సచివాలయం, ప్రగతి భవన్ లోకి ప్రజలకు ప్రవేశం కల్పించి స్వేచ్ఛ ఇచ్చామని, పూలే ప్రజా భవన్ ప్రజలకు వేదిక చేశామని రేవంత్ పేర్కొన్నారు. ప్రతిశాఖలో అధికారులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇచ్చామని, వంద రోజుల్లో.. పరిపాలనను వికేంద్రీకరణ చేశాం, పారదర్శక పాలన అందిచ్చామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతుందని రేవంత్ తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రం వచ్చాక కవులు, కళాకారులు నిరాధరణకు గురయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పులు చేస్తున్నాం. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తల్లి విగ్రహం చేయిస్తాం. అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌ గోడలు బద్దలు కొట్టాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు పనిలో స్వేచ్ఛను ఇచ్చాం. 26 కోట్ల మంది మహిళలు ఇప్పటి వరకు ఉచిత బస్సు ప్రయాణం చేశారు. ఇప్పటి వరకు 8 లక్షల కుటుంబాలు రూ.500 సిలిండర్‌ అందుకున్నాయి. 42 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకాన్ని అందుకున్నాయి అన్నారు.

కేసీఆర్‌ నాటిన కలుపు విత్తనాలు అక్కడక్కడా ఉన్నాయని..ఇప్పటికే చాలావరకు ఏరిపారేశాం…ఇంకొన్ని ఉన్నాయి వాటిని కీడా త్వరలోనే ఏరిపారేస్తాం అన్నారు. డబ్బులు ముందు కట్టి జీరో కరెంటు బిల్లు తీసుకొండని ఒక అధికారి అంటున్నారని విమర్శించారు. గత ముఖ్యమంత్రి నాటిన గంజాయి మొక్కలు ఇంకా వాసనలు వెదజల్లుతున్నాయని దుయ్యబట్టారు. ఎన్నికల నగారా మోగడంతో తన రాజకీయ రూపం చూపిస్తానని అన్నారు. తాను కేంద్రం, గవర్నర్ ఇతర రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలతో ఘర్షణ వాతావరణం కోరుకోవడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. తమ పాలనతో ఈ విషయాన్ని స్పష్టం చేశామన్నారు. పన్నులు ఎగ్గొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. దుబారా ఖర్చులను తగ్గించడంకూడా సంపద సృష్టించడమేనని తెలిపారు.

Read Also ; Unusual Smell Of Urine: మీ యూరిన్ వాస‌న వ‌స్తుందా..? అయితే మీకు ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లే..!