తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) కృష్ణా, గోదావరి నదుల నీటి విషయంలో ప్రతిపక్షాలను సవాల్ చేశారు. ప్రజాభవన్‌లో బనకచర్ల అంశంపై ప్రజాప్రతినిధులకు ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కీలకమైన జలవనరుల అంశాలను అసెంబ్లీలో చర్చిద్దామని సూచించినా, ప్రతిపక్ష నేతలు వీధుల్లో, క్లబ్బుల్లో, పబ్బుల్లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
Old Keypad Phones : మీరు ఉపయోగించని పాత కీప్యాడ్ ఫోన్లు మీ దగ్గర ఉన్నాయా?
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే చర్చ పెడదాం, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా , అన్ని వివరాలను అక్కడే చర్చించుకుందాం..కేసీఆర్ కోరుకుంటే ఫామ్‌హౌస్‌లో జరిగే చర్చలకు స్వయంగా నేను కూడా వస్తా అని అన్నారు. చట్టసభలే చర్చలకు సరైన వేదికగా పేర్కొన్నారు. కేటీఆర్‌ను నేరుగా ఉద్దేశిస్తూ, ఆయన చేసిన సవాళ్లను తక్కువ చేసి మాట్లాడారు.
తెలంగాణకు జరిగిన అన్యాయానికి గల ప్రధాన కారణం మాజీ సీఎం కేసీఆర్ అని తెలిపారు. కేసీఆర్ కాలంలో కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. ఆయన అధికారంలో ఉన్న పదేళ్లలో నీటి పారుదల శాఖను కుటుంబ రాజకీయాలకు వేదికగా మార్చారని ఆరోపించారు. జూరాల ప్రాజెక్టును పట్టించుకోకుండా చిన్నారెడ్డి చెప్పిన విషయాలను సభలో అవమానించిన ఘటనను గుర్తు చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని మళ్లిస్తున్నా, కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులు పూర్తి కాలేదని మండిపడ్డారు.
కేసీఆర్ హయాంలో రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, రాష్ట్రానికి ఉపయోగపడే ప్రాజెక్టులు పూర్తికాలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పేరుకే పెట్టిన చేవెళ్ల ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వలేదని, ప్రజలు నిలదీసే ప్రమాదంతో పేరు మార్చారని ఎద్దేవా చేశారు. 11 ప్రధాన ఎయిబిపి ప్రాజెక్టులను కూడా కేసీఆర్ పట్టించుకోలేదని ఆరోపించారు. చివరికి, చచ్చిపోయిన బీఆర్‌ఎస్ పార్టీకి ఊపిరి పోసేందుకు కేసీఆర్ నీటి సెంటిమెంట్‌ను తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. నీటి హక్కు కోసం చట్టసభల్లో బహిరంగ చర్చకు రావాలని మరోసారి ఆయన స్పష్టం చేశారు.