క్యాబినెట్ విస్తరణ (Cabinet Expansion) పై సీఎం రేవంత్ (CM Revanth) బాంబ్ పేల్చాడు. ఇప్పట్లో విస్తరణ అనేది లేనట్లేనని సీఎం వెల్లడించారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంత అనుకుంటున్న పరిస్థితుల్లో ఇప్పట్లో విస్తరణ అనేదానిపై తాను ఎటువంటి సూచనలు చేయలేనని స్పష్టం చేశారు. క్యాబినెట్లో ఎవరుండాలో నిర్ణయించే అధికారం అధిష్ఠానానికి ఉంది. నేను ఎవరి పేరు ప్రతిపాదించలేదు అని తెలిపారు. దీంతో కొత్త మంత్రులు ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారనే దానిపై ఉత్కంఠ పెరిగింది. గత కొద్దిరోజులుగా క్యాబినెట్ విస్తరణపై ఊహాగానాలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Infosys : ట్రైనీలకు షాకిచ్చిన ఇన్ఫోసిస్.. 400 మందికి ఉద్వాసన !
ఇదే సమయంలో ప్రతిపక్ష నేతలపై కేసుల వ్యవహారాన్ని కూడా సీఎం రేవంత్ స్పష్టతనిచ్చారు. కేసుల విషయంలో చట్ట ప్రకారమే ముందుకెళ్తాం. త్వరగా అరెస్టులు చేయించి జైలుకు పంపాలనే ఆలోచన లేదు అని వెల్లడించారు. దీని ద్వారా ప్రతిపక్ష నాయకులపై ప్రభుత్వం కక్ష సాధించదని హామీ ఇచ్చారు. అలాగే, తాను ఏ నిర్ణయమైనా వ్యక్తిగతంగా తీసుకోనని, పార్టీ ఇచ్చిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తానని సీఎం స్పష్టం చేశారు. పార్టీ ఇచ్చిన బాధ్యతను మాత్రమే నెరవేర్చడమే నా లక్ష్యం. పనిచేయడమే నాకు తెలుసు. వ్యక్తిగత నిర్ణయాలు ఏనాడూ ఉండవు అని పేర్కొన్నారు. కుల గణన ఆషామాషీగా చేసింది కాదన్నారు. ఎంతో పకడ్బందీగా చేశామన్నారు. పీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చిందని.. ఈరోజు లేదా రేపు ప్రకటన ఉంటుందని తెలిపారు. తాను రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోరలేదన్నారు. తనకు రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ లేదని స్పష్టం చేశారు. తమ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందన్నారు.