తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) శ్రీరామనవమి (Sriramanavami) సందర్భంగా భద్రాచలంలో పర్యటించబోతున్నారు. చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన సీతారాముల కళ్యాణం వేడుకల్లో ఆయన సతీసమేతంగా పాల్గొననున్నారు. రామదాసు నిర్మించిన ఈ ఆలయంలో కల్యాణోత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించబడతాయి. ముఖ్యమంత్రి తరఫున పట్టు వస్త్రాలు మరియు ముత్యాల తలంబ్రాలు సీతారాములకు సమర్పించబడతాయి. ఈ ఏడాది కళ్యాణ వేడుకలకు రేవంత్ రెడ్డితో పాటు ఖమ్మం జిల్లా మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, సీతక్కలు హాజరుకానున్నారు.
Rishabh Pant: పంత్ ఒక్కో పరుగు రూ. కోటిపైనే.. ఇప్పటివరకు చేసింది 21 పరుగులే!
ఇక భద్రాచలం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ప్రాంతాల్లో పర్యటించి, పోలవరం ప్రాజెక్టు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయిన మండలాలపై స్పందించనున్నారు. ఈ మండలాల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వారి తరఫున కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ ప్రాంతాలకు సంబంధించిన భూసేకరణ, పునరావాస అంశాలపై దృష్టి పెట్టనుందని సమాచారం. ప్రజల అభ్యున్నతికి గల అవకాశాలను పరిశీలించి, కార్యాచరణ రూపొందించనున్నారు.
Sri Ramanavami : శ్రీరామ నవమి రోజు చేయాల్సిన దానాలు
ఆదివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth ) సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేయనున్నారు. అయితే భద్రతా కారణాల వల్ల ఆ లబ్ధిదారుడి వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భద్రాచలం పరిసరాల్లో ఇటీవల ఎన్కౌంటర్లు జరిగిన నేపథ్యంలో సీఎం పర్యటనపై భద్రతను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. పోలీసులు భద్రాచలాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని మాక్ డ్రిల్‌లు నిర్వహించారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర శాఖల అధికారులు వేడుకల సమయంలో భక్తులకు సేవలందించేందుకు పూర్తిస్థాయిలో మోహరించనున్నారు.