Hyderabad : కమాండ్ కంట్రోల్ సెంటర్‌ ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ లో అధికారుల విధులు, ఇతర అంశాలపై సమీక్షించారు

  • Written By:
  • Publish Date - May 25, 2024 / 07:25 PM IST

సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ ను సందర్శించారు. సీఎం కు డీజీపీ రవి గుప్తా, సీఎస్ శాంతికుమారి స్వాగతం పలికారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ లో అధికారుల విధులు, ఇతర అంశాలపై సమీక్షించారు. నార్కోటిక్స్ బ్యూరో(Bureau of Narcotics) పనితీరు, పలు అంశాలపైనా సీఎం ఆరా తీయడం జరిగింది. సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో డ్రగ్స్ అనేవి లేకుండా చేస్తామని..డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చిన రేవంత్..అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినట్లు డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యహరిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కేవలం హైదరాబాద్ నగరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ కు సంబదించిన వాటిపై తనిఖీలు చేపడుతూ..ఎక్కడిక్కడే అడ్డుకట్ట వేస్తూ వస్తున్నారు. ఇక ఈరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కూడా సీఎం రేవంత్ సైబర్ సెక్యూరిటీ, నార్కోటింగ్ వింగ్‌లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే నార్కోటిక్ డ్రగ్స్ విభాగం పనితీరుపై ఆయన సమీక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నార్కోటిక్స్ బ్యూరోకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో డ్రగ్స్ నిర్ములకు తీసుకోవాల్సిన అంశాలపై పోలీసు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు.

Read Also : Ram charan Vetrimaran : వెట్రిమారన్ కథ చరణ్ ఓకే చేశాడా..?