Young India Skill University : తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు (Skill University In Telangana Board) తో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ బోర్డు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra), మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు (Minister Bhatti , Sridhar Babu ), వర్సిటీ కో ఛైర్మన్ శ్రీని రాజు, సీఎస్ శాంతికుమారి, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. యూనివర్సిటీ విధివిధానాలు, పరిశ్రమలతో అనుసంధానం చేయడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
ఇక స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరఫున రూ.100 కోట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో భేటీలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రూపాలలో సహకరించాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా రేవంత్ విజన్ ఉన్న నాయకుడని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు.
సాంకేతిక నైపుణ్యాలు పెంచుకుని ప్రపంచంతో యువతతో పోటీ పడాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. వృత్తి నైపుణ్యం లేకపోవడంతో పట్టాలు ఉన్నా ఉద్యోగాలు దొరకలేదన్న రేవంత్ దేశానికి ఆదర్శంగా నిలపాలనే ఉద్దేశంతో స్కిల్ వర్సిటీ రూపకల్పన చేసినట్టు తెలిపారు. ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి వ్యవసాయం, విద్యకు ఎంతో ప్రాధాన్యతనిచ్చాని రేవంత్ గుర్తు చేసారు. ప్రపంచంలో నైపుణ్యం ఉన్నవారి కొరత ఉందన్న ఆయన వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్ల నిరుద్యోగం పెరుగుతోందని పేర్కొన్నారు. అందుకే అందరికీ అన్ని రకాల నైపుణ్యాలను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్వహిస్తున్నామని ఈ సందర్బంగా అన్నారు.
Read Also : TTD Laddu : తిరుమల లడ్డు తయారీ నుంచి నందిని నెయ్యిని ఎందుకు తొలగించారు.?