Site icon HashtagU Telugu

CM Revanth Delhi : మూడు రోజుల పాటు ఢిల్లీలో సీఎం రేవంత్ మకాం

Cm Delhi

Cm Delhi

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి హస్తన (Delhi) బాట పట్టబోతున్నారు. ఈరోజు రాత్రి దిల్లీ వెళ్లనున్నారు. మూడు రోజులపాటు దిల్లీ, జైపూర్ లో పర్యటించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు కూడా CM అపాయింట్ మెంట్ తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు (మంగళవారం) ఆయన ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యంగా రాజకీయ కార్యక్రమాలు, వ్యక్తిగత సందర్శనలు ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రాష్ట్రంలో పలు కీలక అంశాలు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో రేవంత్ ఈ పర్యటనకు వెళ్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈనెల 11 నుంచి 13 వరకూ రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో సీఎం పర్యటించనున్నారు. ముందుగా ఈనెల 11న రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌కు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. అక్కడ కొన్ని వ్యక్తిగత పనులు పూర్తి చేసుకున్న అనంతరం ఈనెల 12, 13 తేదీల్లో ఢిల్లీ పెద్దలను రేవంత్ రెడ్డి కలవనున్నారు. రెండ్రోజులపాటు దేశ రాజధానిలో పర్యటించి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు.

సీఎంతోపాటు పలువురు మంత్రులూ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. క్యాబినెట్ విస్తరణపై ఆశావహులు ఇప్పటికే ఎదురు చూస్తుండగా.. ఈ అంశం కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈసారైనా దీనిపై స్పష్టత వస్తుందో, లేదో అని కాంగ్రెస్ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మరోవైపు నేడు (సోమవారం) అసెంబ్లీ సమావేశాలు జరగగా, ఈనెల 16వ తేదీకి సభ వాయిదా పడింది. మొత్తానికి, రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో వ్యక్తిగత కార్యక్రమాలు, రాజకీయ చర్చలు సమన్వయంగా కొనసాగుతాయి. ఈ పర్యటన ద్వారా రాష్ట్ర అభివృద్ధి, పార్టీ వ్యవస్థాపన, వ్యక్తిగత సంబంధాల పరిరక్షణ వంటి అంశాలను ఆయన ముందుకు తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పర్యటన ఫలితాలు ఎలా ఉంటాయన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

Read Also : Dec 10th : అంతర్జాతీయ జంతు హక్కుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు..?