Site icon HashtagU Telugu

TRS/KCR: టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్సీ కవితపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!

Cm Kcr Job Notification

Cm Kcr Job Notification

తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షత టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నకున్నట్లుగానే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్న కేసీఆర్, పార్టీ మారాలని ఒత్తిళ్లు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. తన కూతురు ఎమ్మెల్సీ కవితను కూడా పార్టీ మారాలని అడిగినట్లు కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఎట్టిపరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలు జరగబోవని తేల్చి చెప్పారు. తన కూతురుని బీజేపీలో చేరాలని ఒత్తిడి చేశారంటూ వ్యాఖ్యానించారు. దీనికంటే ఘోరం ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. తన కూతురుపై పార్టీ మారాలని ఒత్తిడి తీసుకువస్తున్న బీజేపీపై గట్టిగా పోరాటం చేయాల్సిందేనన్నారు. ఏపీ సీఎం జగన్ కేంద్రానికి అనుకూలంగా ఉన్నా…ఆయన్ను దెబ్బతీయాలని బీజేపీ ప్లాన్ వేస్తుందన్నారు. ఇంతకంటే అన్యాయం మరొకటి ఉంటుందా అంటూ ప్రశ్నించారు.

ఈడీ దాడులను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్న సీఎం కేసీఆర్..ఎక్కడైతే కేంద్ర సంస్థలు దాడులు చేస్తాయో అక్కడే ధర్నాలు చేయాలని సూచించారు. ఎన్నికలకు పదినెలల సమయం ఉందని పార్టీ నేతలకు తెలిపిన కేసీఆర్…సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు లేదని తేల్చి చెప్పారు. రానున్న ఎన్నికలకు నేతలంతా రెడీ కావాలన్నారు. నిరంతరం ప్రజల్లో ఉండేలా చూసుకోవాలన్నారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉంది…పార్టీ నేతలు , ప్రజాప్రతినిధులు అంతా కూడా క్షేతస్థాయిలో పర్యటించాలన్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సీనియర్ నేతలను ఇంచార్జీగా నియమిస్తామని కేసీఆర్ అన్నారు.

Exit mobile version