Site icon HashtagU Telugu

Amit Shah on KCR: కేటీఆర్ ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యం : అమిత్ షా

Hm Amit Shah

Hm Amit Shah

తెలంగాణ ముఖ్యమంత్రిగా తన కుమారుడు కేటీఆర్ ను చేయడమే కేసీఆర్ లక్ష్యమని కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా విమర్శించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా సరే.. తెలంగాణలో బీజేపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన దినాన్ని కేసీఆర్ ఎందుకు వ్యతిరేకించారో గుర్తించాలన్నారు. టీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఇక్కడ అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఉందంటూ ఆరోపించారు.

ఈ ఎనిమిది సంవత్సరాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారైనా సెక్రటేరియట్ కు వెళ్లారా అని ప్రశ్నించారు. దేశం మొత్తం అభివృద్ధి పథంలో వెళుతుంటే.. తెలంగాణ మాత్రం తిరోగమనంలో ఉందని విమర్శించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆ పార్టీ నేతలంతా టీఆర్ఎస్ పైకి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. అమిత్ షా మొదలు.. ప్రముఖ నేతలంతా తెలంగాణ చుట్టూనే తమ ప్రసంగాలను తిప్పారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణను గెలుచుకోవడం ద్వారా.. దేశంలో బీజేపీ 20 రాష్ట్రంలో అధికారాన్ని సాధిస్తుందని ఈటెల రాజేందర్ అన్నారు. జేపీ నడ్డా కూడా తన ప్రసంగంలో టీఆర్ఎస్ ను విమర్శించారు. అటు నరేంద్రమోదీ కూడా తెలంగాణలో తమ బలం పెరుగుతోందంటూ ట్వీట్ చేయడం గమనార్హం. ఇక్కడ రెండు రోజులు ఉండడం, క్షేత్రస్థాయిలో రిపోర్టులను పరిశీలించిన తరువాత ఆయన ఈ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

Exit mobile version