Site icon HashtagU Telugu

TS CM : త్వరలోనే ఢిల్లీలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ..!!

Cm Kcr

Cm Kcr

తెలంగాణ సీఎం కేసీఆర్…జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటుపై సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దసరా రోజున జాతీయ పార్టీపై ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే పార్టీ శ్రేణులంతా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ ముక్తకంఠంతో స్వాగతం పలికాయి. అయితే ఈ క్రమంలోనే ఈ దసరా రోజు టీఆర్ ఎస్ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి జాతీయ పార్టీ ఏర్పాటుపై ఏకగ్రీవ తీర్మానం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

కాగా జాతీయ పార్టీకి భారత్ రాష్ట్ర సమితి పేరు పరిశీలనలో ఉంది. ఇప్పుడు కొత్తగా మేరా భారత్ మహాన్ కూడా తెరపైకి వచ్చినట్లు సమాచారం. దసరా రోజు తీర్మానం చేసి ఢిల్లీలోకి ఎన్నికల సంఘానికి పంపించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పార్టీ గుర్తుగా ఉన్న కారును తొలగించాలని ఈసీకి విన్నవించే అవకాశం ఉంది. అటు జాతీయ పార్టీ జెండా కూడా రెడీ అయ్యిందట. భారతదేశ చిత్రపటంతోపాటుగా గులాబీ రంగు కూడా ఆ జెండాలో మిళితమై ఉంటుందట.

ఇవన్నీ ఒకే అయ్యాక…ఢిల్లీలో భారీ బహిరంగ సభను నిర్వహించి ఎజెండాను సీఎం కేసీఆర్ వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.