KCR : అత్యాధునిక కార్లను కొనుగోలు చేసిన గులాబీ బాస్…అందుకోసమేనా..?

టీఆరెస్ అధినేత కేసీఆర్...జాతీయ రాజకీయాల అంశం మరోమారు తెరపైకి వచ్చింది. మొన్నటివరకు టీఆరెస్ ను జాతీయ పార్టీగా మారుస్తామని చెప్పారు. కానీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టేందుకు రెడీ అవుతున్న ఆపార్టీ వర్గాలు అంటున్నాయి.

  • Written By:
  • Publish Date - July 23, 2022 / 09:57 AM IST

టీఆరెస్ అధినేత కేసీఆర్…జాతీయ రాజకీయాల అంశం మరోమారు తెరపైకి వచ్చింది. మొన్నటివరకు టీఆరెస్ ను జాతీయ పార్టీగా మారుస్తామని చెప్పారు. కానీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టేందుకు రెడీ అవుతున్న ఆపార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే తాజాగా గులాబీ బాస్ జాతీయ రాజకీయాల్లో పాలు పంచుకునేందుకు ప్రత్యేక కాన్వాయ్ ను తయారు చేసుకుంటున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

గురువారం కొన్ని కార్లు విజయవాడలోని మల్లపల్లి పారిశ్రామిక వాడలోని ఓ గ్యారేజికి వచ్చాయి. ఆ తర్వాత కార్గో విమానంలో వెళ్లాయి. ఓ సంస్థ ఈ కార్లను కార్గో విమానంలో ఎయిర్ పోర్టుకు వచ్చాయి. తర్వాత గ్యారేజికి వెళ్లి కార్లకు కొన్ని ఫిటింగ్స్ చేశారు. తర్వాత వాటిని విమానంలో పంపించారు. ఢిల్లీలోని టీఆరెస్ కార్యాలయానికి చేరుకుంటున్నాయని తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్ కు చెందిన కార్ల విషయం బయటకు పొక్కడంతో చర్చనీయాంశంగా మారింది.

ఇక ప్రగతిభవన్ కార్ల గురించి మాత్రం ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసమే ఈ కార్లను కొనుగోలు చేశారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. అత్యాధునిక టెక్నాలజీతోకూడిన ఈ కార్లను కేసీఆర్ ఓ ప్రముఖ సంస్థ నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ ఎన్నో కార్లను మార్చారు. ఇఫ్పుడు కొత్త కాన్వాయ్ ను ఏర్పాటు చేసుకోవడంచూస్తుంటే ఆయన భవిష్యత్ లో ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది.