KCR Munugode Tour: మునుగోడుకు కేసీఆర్.. మూడు రోజులు అక్కడే!

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక కాక రేపుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు నాయకుల పోటాపోటీగా ప్రచారాలు

  • Written By:
  • Updated On - October 20, 2022 / 11:57 AM IST

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక కాక రేపుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు నాయకుల పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తుంటే, తాజాగా మరోసారి సీఎం కేసీఆర్ మునుగోడులో మూడు రోజులు పర్యటించనున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నిక కోసం ప్రచారం చేయబోతున్నట్లు సమాచారం. అక్టోబరు 28, 29, 30 తేదీల్లో మునుగోడులో బస్సుయాత్ర, రోడ్‌షోకు ప్లాన్ చేయనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

9 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని బుధవారం హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఉప ఎన్నికల ప్రచారంపై కేసీఆర్ దృష్టి సారించారు. మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై ఉప ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. మునుగోడులో మూడు రోజుల పాటు బస్సుయాత్ర ఏర్పాటు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. అక్టోబర్ 30న చండూరులో భారీ బహిరంగ సభకు టీఆర్ ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ తదితరులు కూడా శుక్రవారం నుంచి ప్రచారం ప్రారంభించారు. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు అక్టోబర్‌ 25 నుంచి మునుగోడులో బస చేసి రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించనున్నారు. ఇక కేసీఆర్ మునుగోడు ప్రచార రంగంలో దిగుతుండటంతో మునుగోడు ప్రచార హోరు మరింత రసవత్తరంగా మారనుంది.