Prime Minister Tour: ప్రధాని పర్యటనకు మళ్ళీ కేసీఆర్ డుమ్మా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టనున్నారు. ఏప్రిల్ 8న తెలంగాణలో వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనకు మోడీ రానున్నారు.

  • Written By:
  • Updated On - April 6, 2023 / 10:45 PM IST

Prime Minister Tour: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టనున్నారు. ఏప్రిల్ 8న తెలంగాణలో వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనకు మోడీ రానున్నారు. అధికారిక ప్రోగ్రామ్స్ కు వస్తున్న ప్రధాని మోదీని ఆహ్వానిండానికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ వెళ్లనున్నారు. ప్రధాని పర్యటన కోసం వెయిటింగ్ మంత్రిగా పశుసంవర్ధక శాఖ మంత్రి టి.శ్రీనివాస్ యాదవ్‌ను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నియమించింది. ఆయన బేగంపేట విమానాశ్రయంలో మోడీకి స్వాగతం పలుకుతారు. గత 14 నెలల్లో
రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధానికి తెలంగాణ సీఎం కేసీఆర్ దూరంగా ఉండటం ఇది ఐదోసారి.
సికింద్రాబాద్‌-తిరుపతి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రధాని జెండా ఊపి ప్రారంభించ నున్నారు. ఆ తర్వాత పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని, రూ. 11,300 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.

10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ కేసులో తెలంగాణ పోలీసులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను అరెస్ట్ చేసిన తరుణంలో మోదీ తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
మంగళవారం అర్థరాత్రి సంజయ్‌ను అరెస్టు చేసిన తరువాత, అతన్ని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ప్రధాని పర్యటన సందర్భంగా సంజయ్‌ను ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

12 నవంబర్ 2022న రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసేందుకు ప్రధాని మోడీ తెలంగాణ వచ్చారు. ఆ సమయంలో కూడా ప్రధాన మంత్రిని కేసీఆర్ కలవలేదు.ముఖ్యమంత్రికి పిఎంఓ సరైన ఆహ్వానం పంపకపోవడంపై అధికార భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) అభ్యంతరం వ్యక్తం చేసింది.అంతకుముందు జూలై 2న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి మోదీ వచ్చినప్పుడు కేసీఆర్ ప్రధాని మోదీకి స్వాగతం పలకలేదు.మే నెలలో కూడా కేసీఆర్ మోదీకి పర్యటనకు డుమ్మా కొట్టారు. గత ఏడాది మే నెలలో, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) 20వ వార్షిక వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చారు. అప్పుడు కూడా మోడీ పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఈ సారి కూడా కేసీఆర్ బదులుగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి ఆహ్వానం పలుకుతారు. దీనిపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు. ప్రధానమంత్రి కార్యాలయాన్ని ముఖ్యమంత్రి అవమానిస్తున్నారని ఆరోపించారు.