KCR Politics : బీజేపీపై ‘జార్ఖండ్’ అస్త్రం

టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ జాతీయ ఎజెండాను ప్ర‌క‌టించిన త‌రువాత జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ తెలంగాణ వ‌చ్చారు.

  • Written By:
  • Publish Date - April 28, 2022 / 04:38 PM IST

టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ జాతీయ ఎజెండాను ప్ర‌క‌టించిన త‌రువాత జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ తెలంగాణ వ‌చ్చారు. హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. గురువారం మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్ కు ఆయ‌న చేరుకున్నారు. సాయంత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యేందుకు షెడ్యూల్ అయింది.

కేసీఆర్‌తో భేటీ సంద‌ర్భంగా జాతీయ రాజ‌కీయాల‌పై ఇద్ద‌రు నేత‌లు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్న‌ట్టు స‌మాచారం. అదే స‌మ‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు అనుస‌రిస్తున్న వైఖ‌రిపైనా ఇద్ద‌రు నేత‌లు చ‌ర్చించ‌నున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు ప్రత్యామ్నాయంగా కూట‌మి క‌ట్టే దిశ‌గా కేసీఆర్ ఆలోచ‌న చేస్తుండ‌గా, దానిపైనా హేమంత్ సోరెన్ చ‌ర్చ‌లు జ‌ర‌పనున్నారు.

జార్ఖండ్ సీఎం హేమంత సోరెన్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కావ‌డం ఈ మ‌ధ్య కాలంలో రెండోసారి. కేవ‌లం జాతీయ రాజ‌కీయాల గురించి వాళ్ల మ‌ధ్య చ‌ర్చ ఉంటుంద‌ని భావించ‌లేం. సాధార‌ణంగా కేసీఆర్ ఎవ‌ర్ని ఎక్కువ‌గా ద‌గ్గ‌ర‌కు తీసిన‌ప్ప‌టికీ ప్ర‌త్యేక కార‌ణం ఉంటుంది. ఆ రాష్ట్రంలో జ‌రిగిన ఒక కేసు బీజేపీ కీల‌క లీడ‌ర్ కు సంబంధించిన‌ది గా ఉంద‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. దానికి సంబంధించిన అంశాన్ని కేసీఆర్ ఆరా తీస్తున్నారా? అనే టాక్ నడుస్తోంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ ను అరెస్ట్ చేస్తామ‌ని ఇటీవ‌ల బీజేపీ ప‌దేప‌దే చెబుతోంది. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి క‌ద‌లిక కేంద్రం నుంచి లేదు. అయితే, ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా బీజేపీ కీల‌క లీడ‌ర్ పై జార్ఖండ్ లో ఉన్న కేసును వెలికి తీసే ప్ర‌య‌త్నం జ‌రుగుతుందా? అనే అనుమానం కొంద‌రు వ్యక్తం చేస్తున్నారు. వాళ్లిద్ద‌రి భేటీ వెనుక ఏదో రాజ‌కీయేత‌ర ర‌హ‌స్యం ఉంద‌ని ప్రచారం జ‌రుగుతోంది.