Site icon HashtagU Telugu

Airport Express Metro Line: నేడు ఎయిర్‌పోర్ట్ మెట్రో లైన్‌కు శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్

Cm Kcr

Cm Kcr

హైదరాబాద్ నగరంలో ఇబ్బంది లేని రవాణాను అందించేందుకు మరో ప్రధాన మౌలిక సదుపాయాల పథకం రాబోతోంది. ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో (airport express metro line) కారిడార్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. రాబోయే ప్రాజెక్ట్ మెట్రో (airport express metro line) కారిడార్-4 ఫేజ్ II కోసం రాయదుర్గంలో కొత్త స్టేషన్‌ను నిర్మించనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. ప్రాజెక్ట్ తాత్కాలిక అలైన్‌మెంట్‌ను వివ‌రాల్లు వెల్ల‌డించారు. అతి త్వరలో హైదరాబాద్ నగర వాసులు కారిడార్-4 నుండి ప్రయాణించేటప్పుడు పూర్తిగా భిన్నమైన ప్రయాణాన్ని అనుభవించనున్నారు. రాయదుర్గ్ టెర్మినల్ మెట్రో స్టేషన్ 0.9 కిలో మీట‌ర్ల లైన్‌లో ముగిసే ప్రస్తుత వ్యాల్యూ లైన్‌ను పొడిగించనున్నార‌ని తెలిపారు.

ఎల్ అండ్ టీ మెట్రో రైల్ యాజమాన్యంలోని 15 ఎకరాల స్థలంలో రాయదుర్గ్ ఎయిర్ పోర్ట్ మెట్రో స్టేషన్ ను నిర్మించనున్నారు. అయితే ఖచ్చితమైన ప్రాంతం నిర్ణయించలేదు. ఖాజాగూడ సరస్సుకు ఎడమ వైపున స్థలం ఉంది. దీనిని నానక్ రామ్ గూడ, నార్సింగి, టిఎస్ పోలీస్ అకాడమీ, రాజేంద్రనగర్ కు తీసుకువెళతారు. ఇది నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటుంది. అక్కడ సుమారు 2.5 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ లో ఉండ‌నుంది. మొత్తం 31 కిలోమీటర్ల దూరంలో 27.5 కిలోమీటర్లు ఎలివేటెడ్ మెట్రోగా ఉంటాయి.

కారిడార్ -4 కోసం తేలికపాటి ఏరోడైనమిక్ కోచ్‌లు, మరింత మెరుగైన తాజా సాంకేతికతలతో ఇది ఒక అందమైన అనుభవంగా ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ మెట్రోలో మరింత మెరుగైన ఫీచర్లతో రైల్వేల ఏసీ చైర్ కార్ వంటి ఎక్కువ సీటింగ్ ఏర్పాట్లు ఉంటాయి. మొదట ఎయిర్‌పోర్ట్ మెట్రోలో మూడు కోచ్‌ల రైళ్లు ఉంటాయి. ఇది ఆరు-కోచ్‌లుగా అప్‌గ్రేడ్ చేయబడుతుంది. సిటీ మెట్రో సగటు వేగం గంటకు 36 కిలోమీటర్లు కాగా.. గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ఎయిర్‌పోర్ట్ మెట్రో గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.

Exit mobile version