CM KCR: నేడు మహబూబాబాద్‌, భద్రాద్రి జిల్లాలకు సీఎం కేసీఆర్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే..!

ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) మహబూబాదాద్‌, భద్రాద్రి జిల్లాల పర్యటనకు సర్వం సిద్ధమైంది. గురువారం సీఎం రెండు జిల్లాలోని BRS పార్టీ ఆఫీస్‌తో పాటు, సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. గురువారం మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.

  • Written By:
  • Publish Date - January 12, 2023 / 07:45 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) మహబూబాదాద్‌, భద్రాద్రి జిల్లాల పర్యటనకు సర్వం సిద్ధమైంది. గురువారం సీఎం రెండు జిల్లాలోని BRS పార్టీ ఆఫీస్‌తో పాటు, సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. గురువారం మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. 2 జిల్లాల్లో కలెక్టరేట్లు ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా రెండు జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యాలయాలను కూడా కేసీఆర్ ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన కోసం ఆయా జిల్లాల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ప్రజలకు ఒకేచోట పారదర్శకమైన సేవలు అందించాలనే లక్ష్యంతో అన్ని జిల్లాల్లో కొత్త సమీకృత కలెక్టరేట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు అందుబాటులోకి రాగా మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రూ. 58 కోట్లతో నిర్మించిన కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ను పూర్తిగా పునరుద్ధరించారు. గురువారం ఉదయం 11:10 గంటలకు బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించి.. కేసీఆర్ అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుంటారు. ఉదయం 11.40 గంటలకు కేసీఆర్ కలెక్టరేట్ ను ప్రారంభించిన అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

మహబూబాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లి కొత్తగూడెం-పాల్వంచ జాతీయ రహదారి పక్కన ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. జిల్లా పాలనాధికారి దురిశెట్టి అనుదీప్‌ కొత్త కలెక్టరేట్‌ ఛాంబర్‌లో కూర్చోనున్నారు. కలెక్టరేట్‌లోని గదులను అధికారుల ఛాంబర్లను తనిఖీ చేశారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు.

Also Read: Hockey World Cup 2023: ఘనంగా హాకీ ప్రపంచకప్‌ ప్రారంభోత్సవం

షెడ్యూల్ ఇదే..!

ముఖ్యమంత్రి గురువారం ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి బేగంపేటకు బయలుదేరతారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి 10.15 గంటలకు హెలికాప్టర్‌లో మహబూబాబాద్‌కు బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకు మహబూబాబాద్ చేరుకుని ఉదయం 11.10 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయన్ని కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.

అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు హెలికాప్టర్ లో చేరుకుంటారు. 1.55 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేరుకుని నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయన్ని ప్రారంభించి 2.55కు పబ్లిక్ మీటింగ్ జరిగే ప్రాంతానికి చేరుకుంటారు. 3.20కి బహిరంగ సభ ముగించుకుని భద్రాద్రి కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు 3.35 గంటలకు చేరుకుంటారు. పార్టీ ఆఫీసు ప్రారంభించిన తరువాత 4.05కి అక్కడి నుంచి బయలుదేరి కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియానికి చేరుకోనున్నారు. 4.30కి అక్కడి నుంచి ప్రయాణమై 5.30కి బేగంపేట ఎయిర్ పోర్టుకు తిరిగి చేరుకుంటారు. దింతో సీఎం పర్యటన ముగుస్తుంది.