Site icon HashtagU Telugu

TS New Secretariat : జనవరి 18 న కొత్త సచివాలయం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్..!!

New Sachivalayam

New Sachivalayam

తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం దాదాపు ఫూర్తయ్యింది. వచ్చే ఏడాది జనవరి 18న ప్రారంభించేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు. ఆలోపు మిగిలిన పనులన్నీ పూర్తి చేయలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఆరో అంతస్తులోని తన బ్లాక్ ను సీఎం కేసీఆర్ జనవరి 18న ప్రారంభించనున్నారు. తన చాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి పాలనను కొనసాగించనున్నారు సీఎం కేసీఆర్.

కాగా 2020 జూలైలో తెలంగాణ పాత సచివాలయంను కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ స్థలంతోనే కొత్త సచివాలయం నిర్మాణం చేపట్టారు. అయితే సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ రేవంత్ రెడ్డి సహా పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అయితే పాతసచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పనులు పూర్తి చేసిన త్వరగా కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని సర్కార్ ను కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో స్పీడ్ గా పనులు చేపట్టిన సర్కార్…సచివాలయం నిర్మాణ పనులు పూర్తిచేసింది.