తాజాగా నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం(Telangana Cabinet Meeting) జరిగింది. సీఎం కేసీఆర్(CM KCR) అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం నేడు సాయంత్రం జరిగింది. ఈ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలని తెలిపారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజా రవాణాని పటిష్టం చేసేందుకు ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాం. దీనికి సంబంధించిన బిల్లుని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదిస్తాం. ఈ నిర్ణయంతో దాదాపు 43 వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఇటీవల ఆర్టీసి సంస్థ ఉద్యోగులు, అధికారులు, కార్మికులు సమస్యలని సీఎం కేసీఆర్ కి విన్నవించారు. ఆర్టీసీ కార్మికులు చాలా రోజులుగా ఈ శుభవార్త కోసం ఎదురుచూస్తుంది. వారి సమస్యలని పరిష్కారం అవ్వడానికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోతున్నాం అని తెలిపారు.
ఇక దీనికి కావాల్సిన విధి విధానాలకు సంబంధిన కార్యాచరణ వెంటనే ప్రారంభించాలని రవాణాశాఖ, శాసనసభా వ్యవహారాలశాఖ, ఆర్థిక శాఖ మంత్రులకు, అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు అంతా ప్రభుత్వ రంగంలోకి రానున్నారు అని కేటీఆర్ తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read : TSRTC: మహిళలకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. లేడీస్ స్పెషల్ బస్సు ప్రారంభం!