CM KCR :మోదీని చూస్తే ఇక్కడున్న బీజేపీ నేతలకు వణుకుతుంది..!!

కాషాయం జెండాను చూసి మోసపోవద్దని...మోసపోయి బాధపడాల్సి వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ సభలో వ్యాఖ్యానించారు.

Published By: HashtagU Telugu Desk
CM kcr and telangana

CM KCR Telangana

కాషాయం జెండాను చూసి మోసపోవద్దని…మోసపోయి బాధపడాల్సి వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ సభలో వ్యాఖ్యానించారు. వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్…అక్కడ ప్రసంగించారు.

కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా ఎంతో తేల్చమంటే కేంద్రం పట్టించుకోవడం లేదని…తెలంగాణ బీజేపీ నేతలకు దమ్ముంటే ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని నిలదీయాంటూ సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిలిచిపోయిందని కృష్ణా జలాల్లో వాటా ఎంతో తేల్చాలని కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. కానీ తెలంగాణ బీజేపీ నేతలు మోదీని చూస్తే వణికిపోతారని ఎద్దేవా చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతిఇంటికీ నీళ్లు తీసుకువచ్చే బాధ్యత తనదని స్పష్టం చేశారు కేసీఆర్.

ఈ 8ఏళ్లకాలంలో బీజేపీ ఏం చేసిందంటూ ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేయని మోదీ ప్రభుత్వం…ఉచిత పథకాలు రద్దు చేయాలని చెబుతోందని మండిపడ్డారు. బీజేపీ జెండాను చూసి మోసపోకండి…ఉచిత కరెంటు రాదు, మోటార్లకు మీటర్లు పెడతారంటూ పేర్కొన్నారు. రైతులకు ఫ్రీ కరెంటు ఇవ్వని మోదీ ప్రభుత్వ పారిశ్రామికవేత్తలకు మాత్రం రూ. 20లక్షల కోట్లు దోచిపెడుతోందని మండిపడ్డారు.

  Last Updated: 16 Aug 2022, 08:42 PM IST