Site icon HashtagU Telugu

BRS : తుమ్మ ముళ్లు కావాల్నో, పువ్వాడ పువ్వులు కావాల్నో మీరే తేల్చుకోండి – కేసీఆర్

Kcr Kmm

Kcr Kmm

మరోసారి మాజీ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) ఫై సీఎం కేసీఆర్ (KCR) నిప్పులు చెరిగారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. ముఖ్యంగా అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) ప్రచారం తో హోరెత్తుస్తుంది. గులాబీ బాస్ కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ పేరుతో జిల్లాలో సభలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాలో సభలు ఏర్పాటు చేయగా..ఈరోజు ఖమ్మం (BRS Public Meeting In Khammam) , కొత్తగూడెం సభల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఫై నిప్పులు చెరిగారు.

ముఖ్యంగా ఖమ్మం సభలో కేసీఆర్ మాట్లాడుతూ..తుమ్మ ముళ్లు కావాల్నో, పువ్వాడ (Puvvada Ajay Kumar) పువ్వులు కావాల్నో మీరే తేల్చుకోండి అంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు. ‘ఖమ్మంలో ఎన్నికల్లో నిలబడ్డ వ్యక్తుల గుణగణాలు మీకు తెలుసు. ఒకాయన అయితే చాలా గొప్పవాడు. పోయినసారి ఓడిపోతే మంత్రి పదవి ఇచ్చిన అని నేను చెబితే.. నాకే మంత్రి పదవి ఇచ్చిన అని చెప్పిండు. అదంత చరిత్ర మీ కండ్ల ముందున్నది. మీ సాక్షిగా జరిగింది. ఇదే అజయ్‌ కుమార్‌ చేతిలో ఓడిపోయి మూలకుపడి ఉంటే.. మంత్రిని చేసి జిల్లా అప్పగిస్తే ఆయన సాధించిన ఫలితం గుండుసున్నా. ఒక్క అజయ్‌ తప్ప ఎవరూ గెలువలేదు’ అంటూ గుర్తు చేశారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ వాళ్లను ఒక్కరినిగూడ.. అసెంబ్లీ గడప తొక్కనియ్య అని ఒక అర్భకుడు మాట్లాడుతున్నడు. నువ్వు ఖమ్మం ప్రజలను గుత్తపట్టినవా? జిల్లాకు జిల్లానే కొనేసినవా? ఖమ్మం జిల్లా ప్రజలు దీన్ని సహిస్తరా? ప్రజాస్వామ్యవాదులు దీన్ని సహిస్తరా? ఎంత వరకు ఇది ధర్మం. ఇది చైతన్యవంతమైన జిల్లా. పోరాటాల ఖిల్లా. కమ్యూనిస్ట్‌ పార్టీలు ఎంతో చైతన్యం తీసుకువచ్చాయి. అందుకే మొదట మీతో ప్రార్థించింది.. విక్షణాయుతంగా ఎవరు గెలిస్తే ఈ రాష్ట్ర ప్రయోజనాలకు మంచిదో.. ఎవరి చేతుల్లో తెలంగాణ సురక్షితంగా ఉంటదో మీ అందరికీ తెలుసు’నన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తెలంగాణ జెండా ఎత్తినయా? తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడన్నా భుజానికి ఎత్తుకున్నరా? మనం ఎత్తుకున్నప్పుడు మనల్ని అవమానించారు.. కాల్చి చంపారు.. జైళ్లలో పెట్టారు తప్పా వాళ్లకు ఎందుకు ప్రేముంటదు. కాంగ్రెస్‌ నాయకులకు సొంతం కథ ఉండదు. ఢిల్లీలో స్విఛ్‌ వస్తేనే ఇక్కడ లైట్‌ వెలుగుతుంది. మరి ఢిల్లీ గులామ్‌ల కింద ఉండి.. మనం కూడా గులామ్‌ అవుదామా? ఈ రోజు ఖమ్మంలో చెబుతున్నా.. కేసీఆర్‌ అన్నట్లే నిజమైందని అంటరు. రాబోయే రోజంతా కూడా ప్రాంతీయ పార్టీల యుగం రాబోతున్నది. ఎక్కడి వారు అక్కడ ఉంటేనే.. ఆ రాష్ట్రం ప్రయోజనాలు కాపాడుతారు. వాళ్లకు కడుపు నొప్పి ఉంటది.. కాళ్ల నొప్పి ఉంటది.. చేసుకుంటరు.. ఎలా ఉన్న ఖమ్మాన్ని.. ఐదారేళ్లలో ఎలా చేసుకున్నాం మీ కండ్ల ముందే ఉన్నది. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటన్నింటిపై విచారం చేసి, ఆలోచించి అమూల్యమైన ఓటును కారు గుర్తుకు ఓటేసి పువ్వాడ అజయ్‌ కుమార్‌ను గెలిపించాలని కోరుతున్నా’అంటూ పిలుపునిచ్చారు.

అలాగే కొత్తగూడెం సభలో(Kothagudem) కేసీఆర్ మాట్లాడుతూ..ఎన్నికలు వస్తే గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయని, ఆగం కావొద్దని ప్రజలకు సూచించారు. చేసిన అభివృద్ధి, సంక్షేమం చూసి పార్టీ, ఆ పార్టీ తరఫు అభ్యర్థికి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హయాంలో సింగరేణి టర్నోవర్ రూ.11 వేల కోట్లు మాత్రమే ఉండేది. సమైక్య రాష్ట్రం ఉంటే కొత్తగూడెం జిల్లా వచ్చేది కాదు. కొత్తగూడేనికి ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చింది. ఈ నియోజకవర్గంలో 13,500 ఎకరాల పోడు భూమికి పట్టాలిచ్చాం. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కానిది బీఆర్ఎస్ హయాంలో చేసి చూపించాం. సీతారామ ప్రాజెక్టు 70 శాతం పూర్తైంది. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. నేనే వచ్చి సీతారామ ప్రాజెక్టు పూర్తి ప్రారంభిస్తా.’ అని కేసీఆర్ తెలిపారు. ఎన్నికల సమయంలో కొన్ని పార్టీల నేతలు ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు బూతులు తిడుతూ, అబద్ధాలు చెబుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు.

Read Also : world cup 2023: ఈడెన్ గార్డెన్స్ లో విరాట్ సరికొత్త చరిత్ర… ఫాన్స్ కు కోహ్లీ బర్త్ డే గిఫ్ట్

Exit mobile version