Telangana: అభ్యర్థి గత చరిత్ర చూసి ఓటెయ్యండి: కేసీఆర్

తెలంగాణ ఎన్నికల వేళ బీఆర్ఎస్ దూకుడు పెంచింది. పార్టీ భారాన్ని నెత్తినేసుకుని ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ రోజు కాకాజ్ నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

Telangana: తెలంగాణ ఎన్నికల వేళ బీఆర్ఎస్ దూకుడు పెంచింది. పార్టీ భారాన్ని నెత్తినేసుకుని ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ రోజు కాగజ్‌నగర్‌ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ఓటు వేసే క్రమంలో ఎవరూ కూడా భయపడకుండా ఓటు వేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.

కాగజ్‌నగర్‌ బీఆర్ఎస్ తరుపున కోనప్ప నిలబడుతున్నారని తెలిపారు. అయితే ఓటు వేసేటప్పుడు అలోచించి పానిక్ కాకుండా ఓటు వేయాలని సభకు వచ్చిన ప్రజలనుద్దేశించి చెప్పారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 పూర్తయిన కూడా ప్రజాస్వామ్య ప్రక్రియ సరిగా లేదని చెప్పిన కేసీఆర్ ఆ పరిస్థితి రావాల్సిన అవసరం ఉన్నారు. ఎన్నికలు వస్తూ , పోతుంటాయి. ఒక్కో పార్టీ తరుపున ఒక్కో అభ్యర్థి నిలబడతారు. అయితే ఓటు వేయడానికి ఎవరు వెనకాడవద్దని సూచించారు.

ప్రతి ఒక్కరు పోటీ చేయనున్న అభ్యర్థి అర్హతలు మరియు సేవా సామర్థ్యం గురించి ఆలోచించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అభ్యర్థుల వెనుక ఏ పార్టీ ఉంది? వారి చరిత్ర విధానాలు, ప్రజలు, రైతుల గురించి మీరు ఏమనుకుంటున్నారు? అధికారం వస్తే ఎలా వ్యవహరిస్తారో ఆలోచించండి అంటూ విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు ముగిసినా ఈ ప్రక్రియ ఆగదు. ఇక్కడ గెలిచే ఎమ్మెల్యేతోనే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. మీ ఓటు వజ్రంతో సమానం, అన్నిటికంటే ఓటు అత్యంత విలువైనది. కాబట్టి ఓటు విషయంలో ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని అన్నారు. మొత్తంగా విచక్షణతో ఎవరు గెలుస్తారో తేల్చుకుని ఓటు వేయాలని కేసీఆర్ ప్రజలకు సూచించారు.

Also Read: Relationship : మీతో ప్రేమలో ఉండే వ్యక్తి చేసే 9 విషయాలివే..!