CM KCR : రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు కేంద్రం కుట్ర.!!

దేశంలో వ్యవసాయాన్ని కార్పోరేట్ల పరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.

  • Written By:
  • Updated On - August 21, 2022 / 12:11 AM IST

దేశంలో వ్యవసాయాన్ని కార్పోరేట్ల పరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవాళ ఆయన మునుగోడు సభలో ప్రసంగించారు. వ్యవసాయానికి మీటర్లు పెట్టాలన్న ఒత్తిడి తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఎరువుల ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు. రైతులు, పేదలకు పలు పథకాల కింద డబ్బులు ఎందుకు ఇస్తున్నారని కేంద్ర మంత్రి ఒకరు తమతో అన్నట్లు వెల్లడించారు కేసీఆర్.

ప్రజలంతా ఒక్క విషయాన్ని బాగా గమనించాలి .కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి 8ఏళ్లు అయ్యింది. ఒక్క మంచి అయినా జరిగిందా…ఎవరికి జరిగింది. దళితులు, గిరిజనులు, మహిళలు, కార్మికులు, రైతులు ఎవరికి మేలు జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. కనీసం ఒక్కటైనా మంచి పని జరగలేదు. మరి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. పైగా ఎయిర్ పోర్టులు, రైళ్లు, బ్యాంకులు, గ్యాస్ కంపెనీలు, రోడ్లు…ఇలా అన్నింటినీ అమ్మేయడం మొదలెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్.

ఇప్పుడు రైతులు, భూములు, వ్యవసాయ పంటలపై పడుతోంది కేంద్రం. రైతులకు, రైతు కూలీలకు నోట్లు మట్టి కొట్ట ప్రయత్నం జరుగుతోంది. వ్యవసాయ బావుల దగ్గర మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెస్తోంది. నేను చచ్చినా వ్యవసాయ బావుల దగ్గర మీటర్లు పెట్టబోనని తేల్చి చెప్పారుకేసీఆర్. ఎరువుల ధరలు పెంచాలి, కరెంటే ధర పెంచాలి, పండిన పంటలు కొనరు. రైతులు ఇక తాము వ్యవసాయం చేయలేమని చాలించుకునే పరిస్థితిని కలిపిస్తున్నారు. ఇలా ఉంది కేంద్ర ప్రభుత్వ విధానం అంటూ మండిపడ్డారు. కార్పొరేట్ వ్యవసాయం పెడదాం మీరు మా వద్ద కూలీలుగా పనిచేయండి ఇదే వారి కుట్ర దీన్ని అంతా గమనించాలని సీఎం సూచించారు.

కేంద్రం రాష్ట్రంలో రైతుల ధాన్యం కొనాలని అంటే మేం ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశాం. అయినా వడ్లు మేం కొనం అన్నారు. మేము గట్టిగా అడిగితే మై క్యార్నా అన్నారు. మీడియా వాళ్లు లేని సమయం చూసి తలుపులు పెట్టి మాట్లాడారు. ఎందుకు మీరు డబ్బులన్నీ ఖర్చు చేస్తున్నారని మమ్మల్ని అడిగారు. రైతులుకు డబ్బులకు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. 2వేల రూపాయల పెన్షన్లు ఎందుకు ఇస్తున్నారని అడిగారు. పేదలకు పెన్షన్లు ఇవ్వద్దా…ఎవరి ఇవ్వాలో చెప్పండి మరి. పేదలకు కొట్టి తీసుకెళ్లి పెద్ద కార్పొరేటర్లకు ఇవ్వాలా…ఇప్పుడు దేశంలో జరుగుతోంది ఇదే అంటూ ఆరోపించారు కేసీఆర్.