KCR : దుబ్బాక పెట్టిన భిక్ష వల్లే నేను ఈ స్థాయికి ఎదిగా – కేసీఆర్

రాహుల్‌కు ఎద్దు, ఎవుసం తెలుసో తెల్వదో నాకు తెల్వుదు

  • Written By:
  • Publish Date - November 26, 2023 / 09:42 PM IST

దుబ్బాక (Dubbaka )తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని.. ఇప్పుడు సీఎం స్థాయికి ఎదిగానంటే అది దుబ్బాక పెట్టిన బిక్ష వల్లే అని అన్నారు సీఎం కేసీఆర్ (CM KCR). ఆదివారం దుబ్బాకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఫై ఫైర్ అయ్యారు. ‘కాంగ్రెస్‌కు తమాషా.. మనకు జీవన్మరణ సమస్య. రైతుల భూముల బాధలు నాకు తెలుసు. మూడు సంవత్సరాలు తండ్లాడి ధరణిని తీసుకువచ్చాం. ఇంతకు ముందు రైతు భూమిపై హక్కులు రైతుల దగ్గర ఉండేవి కావు. ఏ రాత్రి ఎవడు కిందమీద రాసినా భూమి మారిపోయేది. ఎల్లయ్య భూమి మల్లయ్యకు.. మల్లయ్యది పుల్లయ్యకు రాస్తురు. ఆ బాధ పోవాలని ప్రభుత్వంలో ఉండే అధికారాన్ని తీసివేసి మీ బొటనవేలికి ఇచ్చాం.

మీ బయోమెట్రిక్‌ లేకుండా భూమిని మార్చే అధికారం ముఖ్యమంత్రికి కూడా లేదు. ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌ గాంధీ కూడా మాట్లాడుతున్నడు. రాహుల్‌కు ఎద్దు, ఎవుసం తెలుసో తెల్వదో నాకు తెల్వుదు. కాంగ్రెస్‌ వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తమని అంటున్నడు. దాని స్థానంలో భూమాత పెడుతరట. అది భూమాతనా? భూమేతనా? అంటూ ప్రశ్నించారు.

2001లో గులాబీ జెండా ఎగిరితే, 2004లో కాంగ్రెస్ పార్టీ మనతో పొత్తు పెట్టుకుందని తెలిపారు. 2004లో అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. దుబ్బాక ఉపఎన్నికల్లో దెబ్బతిన్నాం, మళ్లీ అలా జరగకూడదని ఓటర్లను కోరారు. రైతు బంధును పుట్టించింది బీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నాడని, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 24 గంటలు కరెంట్ వద్దు, మూడే గంటలు చాలు అని అంటున్నాడని, రాహుల్ గాంధీకి ఎద్దు, వ్యవసాయం గురించి తెలుసో లేదో అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రభాకర్ రెడ్డి దోమకు కూడా అన్యాయం చేయడని, దుబ్బాకలో ఎప్పుడైనా కత్తిపోట్లు చూశామా..? మనకు కత్తులు దొరకవా..? అని ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. దుబ్బాక ఉపఎన్నికల సమయంలో నేను రాలేదని, అప్పుడు వస్తే కథ ఒడిసిపోయేదని, నోటికివచ్చినట్లు ఇక్కడ ఎమ్మెల్యే వాగ్ధానాలు చేశాడని విమర్శించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, నేను కేంద్రానికి ఎన్నోసార్లు లేఖలు రాశానని, 157 మెడికల్ కాలేజీల్లో కేంద్రం తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. నవోదయ కూడా ఒక్కటి ఇవ్వలేరని చెప్పారు. ఏమీ ఇవ్వని బీజేపీ పార్టీకి ఓటు ఎందుకు వెయ్యాలి..? బీజేపీవి జూటా మాటలని, దుర్మార్గుల చేతికి తెలంగాణ ఇచ్చి ఆగం కావడన్ని ప్రజల్ని కోరారు. నేను దుబ్బాకలో ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయాని కోరానని, ఆయన గెలిస్తే నెల రోజుల్లో దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేస్తానని హామీ ఇచ్చారు.

Read Also : PM Modi: తెలంగాణలో బీసీలకు న్యాయం జరగలేదు: ప్రధాని మోడీ