CM KCR: రిపబ్లిక్ డే వేడుకలకు కేసీఆర్ డుమ్మా!

గత కొంతకాలంగా రాజ్ భవన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సీఎం ఈసారి కూడా దాటవేశారు.

  • Written By:
  • Updated On - January 26, 2023 / 12:23 PM IST

గత కొంతకాలంగా రాజ్ భవన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సీఎం ఈసారి కూడా దాటవేశారు. ఈరోజు రాజ్‌భవన్‌ (Raj Bhavan)లో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతకుమారితో పాటు కేసీఆర్ కూడా దూరంగా ఉన్నారు. ప్రగతి భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (CM KCR) పాల్గొన్నారు. జెండా ఆవిష్కరించి రిపబ్లిక్ డేనుద్దేశించి సీఎం కేసీఆర్ (CM KCR) మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటైతే ఏ సమస్యలు పరిష్కారం అవుతాయని భావించామో అవన్నీ పరిష్కారమయ్యాయని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతి రంగంలో కూడా తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ముఖ్యంగా రైతాంగానికి అధిక లాభం జరిగిందన్నారు. విద్యుత్‌, సాగునీరు, విద్య, వైద్య, పారిశ్రామిక, ఐటీ తదితర రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామని సీఎం కేసీఆర్ అన్నారు.

పరేడ్ గ్రౌండ్ లో కూడా కేసీఆర్ (CM KCR) జెండాను ఆవిష్కరించారు. ఇక తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. రాజ్‌భవన్‌లో 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ (Governer) ప్రసంగించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన హైదరాబాద్ అనేక రంగాల్లో ముందుకు సాగుతున్నదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. వైద్యం, ఐటీ రంగాల్లో నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్‌తో అనుసంధానం ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు ఆమె గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

జ‌న‌వ‌రి 26 రోజున (Republic Day) భారతదేశం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోబోతోంది. మరోవైపు, ఇప్పటి వరకు తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి ఏ మాత్రం స్పందించలేదు. వేడుకలను నిర్వహిస్తున్నారా? లేదా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. గణతంత్ర వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలంటూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. పరేడ్ తో కూడిన వేడుకలను నిర్వహించాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ను పాటించాల్సిందేనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Also Read: Samantha’s Shaakuntalam: దుష్యంతుడు, శ‌కుంత‌ల మ‌ధ్య ప్రేమ‌ను తెలియ‌జేసే సాంగ్ రిలీజ్