Site icon HashtagU Telugu

CM KCR : కేంద్రం ఆర్టీసీని అమ్మే ప్రయత్నం చేస్తోంది..!!

Kcr Imresizer

Kcr Imresizer

ఆర్టీసీని అమ్మేయ్యాలంటూ కేంద్రం లేఖలు రాస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఇవాళ విద్యుత్ సంస్కరణలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం అవలంభిస్తున్న విధానాలపై ఫైర్ అయ్యరు. మీటర్ పెట్టకుండా విద్యుత్ కనెక్షన్ ఇవ్వొద్దంటూ కేంద్రం తీసుకువచ్చిన గెజిట్ లోనే ఉంది. గెజిట్ నిన్నగాక మొన్న వచ్చింది. చట్టంలో లేదు..మేము అనలేదు అంటున్నారు. ఏపీలోని శ్రీకాకుళంలో మీటర్ పెడితే రైతులంతా ధాన్యం కుప్పలు పోసి ధర్నా చేశారు ఇలాంటి ప్రమాదం తెలంగాణకు వస్తే సర్వనాశనం అవుతుందని వాస్తవాలు తెలుసుకున్నాం. యూపీ ఎన్నికల్లో కల్లబొల్లిమాటలు చెప్పారు. ఉచిత కరెంటు ఇస్తామన్నారు. అక్కడ మీటర్లు పెడితే మూడు, నాలుగు జిల్లాల్లో రైతులంతా విద్యుత్ సబ్ స్టేషన్ల ముందు మీటర్లు పోసి పెద్దెత్తున ఆందోళన నిర్వహించారు. ఇంకా ఆందోళనలు జరుగుతున్నాయ్ అంటూ గుర్తు చేశారు.

ఆర్టీసీని అమ్మేయాలంటూ లెటర్లు వస్తున్నాయి. ఎవరు ముందు అమ్మితే వారికి వెయ్యి కోట్లు బహుమతి అంటూ ఆఫర్ చేస్తున్నారు. కేంద్రంలో NDA ప్రభుత్వం ఆర్టీసీని అమ్మాలని లెటర్లు పంపాలని ఆర్థికమంత్రి పంపారు. చివరగా చెప్పేదేంటంటే…మేము అమ్ముతున్నాం…మీరు కూడా అమ్మండి అనే పద్ధతితో వ్యవహరిస్తున్నారంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు.

Exit mobile version