Site icon HashtagU Telugu

KCR Kondagattu: దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రంగా కొండగట్టు: కేసీఆర్

cm kcr Kondagattu

Kondagattu

తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) యాదాద్రి తరహాలో కొండగట్టు ఆలయాన్ని డెవలప్ చేయాలని సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన కొండగట్టు (Kondagattu) ఆలయ క్షేత్రాన్ని సందర్శించారు. ఆంజనేయ స్వామి ఆలయానికి  చేరుకొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండగట్టులో ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పై అధికారులతో రెండు గంటలకు పైగా సుదీర్ఘ సమీక్ష (Review) సమావేశం నిర్వహించారు కేసీఆర్. ఈ సమీక్షలో పలు ముఖ్యమైన విషయాలను ఆయన ప్రస్తావించారు.

దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు అనే పేరు రావాలి అని కేసీఆర్ సూచించారు. ప్రపంచాన్నే ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టు (Kondagattu) ను తీర్చిదిద్దాలని, కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి బృహత్తర ప్రాజెక్ట్ కు రూపకల్పన చేయనున్నట్టు తెలిపారు. భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని (Temple) అభివృద్ధి చేయాలని కేసీఆర్ సూచించారు. ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్డులను అభివృద్ధి చేయాలని, గొప్పగా హనుమాన్ జయంతి కొండగట్టు లో జరగాలి అని వెల్లడించారు.

వేల మంది ఒకేసారి హనుమాన్ (Hanuman) దీక్ష ధారణ, విరమణ చేసే సమయంలో ఏలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని,  హనుమాన్ దీక్ష దివ్యంగా, గొప్పగా జరిగేలా ఏర్పాట్టు చేయాలని ఆయన పేర్కొన్నారు.  సుమారు 850 ఎకరాలలో ఆలయ అభివృద్ధి , విస్తరణ పనులు చేయాలని, పెద్ద వాల్, పార్కింగ్, పుష్కరిణీ, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, కోనేరు, పుష్కరిణీ నీ అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు.  86 ఎకరాలలో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని, వసతులు గొప్పగా ఉంటే దర్శనానికి వచ్చే భక్తులు పెరుగుతారని అన్నారు. కొండగట్టు (Kondagattu) పరిసరాలను పరిశీలించిన కేసీఆర్  మళ్ళీ వస్తా…. ఆలయ అభివృద్ధి, విస్తరణ పై సమీక్ష నిర్వహిస్తాను అని అధికారులతో తేల్చి చెప్పారు.

కేసీఆర్ ముఖ్యమైన కామెంట్స్

– దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు అనే పేరు రావాలి
– ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్డులను అభివృద్ధి చేయాలి
– దేశంలోనే గొప్పగా హనుమాన్ జయంతి కొండగట్టు లో జరగాలి
– సుమారు 850 ఎకరాలలో ఆలయ అభివృద్ధి , విస్తరణ పనులు చేయాలి
– పెద్ద వాల్, పార్కింగ్, పుష్కరిణీ, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, కోనేరు, పుష్కరిణీ నీ అభివృద్ధి చేయాలి
– 86 ఎకరాలలో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేయాలి
Also Read: Hyderabad Cricket Association: అజరుద్దీన్ కు షాక్.. ప్రక్షాళన దిశగా హెచ్‌సీఏ!