Khammam BRS Sabha: కేసీఆర్ సంచలనం.. దేశ రైతులకు ఉచిత విద్యుత్!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సభనుద్దేశించి మాట్లాడారు. భారత రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Written By:
  • Updated On - January 18, 2023 / 06:00 PM IST

ప్రజలు, (People) ప్రజా ప్రతినిధులు ఏకం అయ్యారు. దేశం కోసం, భారత దేశ బాగు కోసం ఖమ్మం వైపు కదంతొక్కారు. నభూతో నా భవిష్యత్తు అన్నట్టు మాదిరిగా సీఎం కేసీఆర్ (CM KCR) నిర్వహిస్తున్న సభ భారత రాజకీయాల ద్రుష్టి సారించేలా చేసింది. భారత రాష్ట్ర సమితి తొలి బహిరంగ సభకు ఖమ్మం (Khammam) జిల్లా నుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఏకంగా ముగ్గురు సీఎం కేసీఆర్ ఖమ్మం సభలో పాల్గొనడం విశేషం. ఒక వేదికపైనే కనీసం 200 మంది అతిథులు కూర్చున్నారంటే సభ ఎలా జరిగిందో అర్థమవుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సభనుద్దేశించి మాట్లాడారు.

దేశ దుస్థితికి కాంగ్రెస్‌, బీజేపీనే కారణం అని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే బీజేపీని తిడుతుందన్నారు. అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ను తిడుతుంది. దేశంలో 4.10 లక్షల మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం ఉంది. ఎప్పుడూ 2 లక్షల మెగావాట్ల విద్యుత్‌కు మించి వాడలేదు. రోజూ వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు సిగ్గుపడాలి. పీఏల పేరుతో రూ.14 లక్షల కోట్లు దోచిపెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ ను గెలిపిస్తే దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. బీజేపీది ప్రైవేటైజేషన్ విధానమైతే.. బీఆర్‌ఎస్‌ది నేషనలైజేషన్ విధానమన్నారు. ఎల్‌ఐసీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వంటి వాటిని తిరిగి మళ్లీ జాతీయకరణ చేస్తామన్నారు సీఎం కేసీఆర్‌ (CM KCR) అన్నారు.

ఖమ్మం జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు..
ఖమ్మం వేదికగా సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఖమ్మం హెడ్‌ క్వార్టర్‌లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని ప్రకటించారు. నెల రోజుల్లోనే ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్‌ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల గురించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలం లేకుంటే ప్రభుత్వమే భూమిని సేకరించి జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తుందని ప్రకటించారు. ఫొటో జర్నలిస్టులు, కెమెరా జర్నలిస్టలందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు.

సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అద్భుతం: కేరళ సీఎం

తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేపట్టారని కేరళ సీఎం పినరయి విజయన్‌ కొనియాడారు. ప్రజల సౌకర్యార్థం అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. లక్షలాది మందికి ఉపయోగపడే కంటి వెలుగు పథకం అద్భుతమని కొనియాడారు.

కేసీఆర్ మాకు పెద్దన్న లాంటివాడు – ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌
కేసీఆర్ మాకు పెద్దన్న లాంటి వారు.. కంటివెలుగు కార్యక్రమం నుంచే మేము చాలా నేర్చుకున్నామన్నారు ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌. ఢిల్లి వెళ్లాకా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. పంజాబ్‌లోనూ ఈ క్రమాన్ని చేపడతామని అన్నారు. కొత్త కలెక్టరేట్ల నిర్మాణం ఒక అద్భుతంగా ఉన్నాయన్నారు.

సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు – పంజాబ్ సీఎం
దేశమనే పుష్పగుచ్ఛంలో అన్ని రకాల పూలు ఉంటేనే బాగుంటుందన్నారు. కానీ , కొందరు ఒకే రంగు పువ్వులను కోరుకుంటున్నారని విమర్శించారు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదన్నారు. రాజు బికారి అవుతాడు, బికారి రాజు అవుతాడన్నారు.

Also Read: Shubman Gill @200: డబుల్ సెంచరీ కొట్టిన గిల్.. భారత్ భారీ స్కోర్!