తొమిదిన్నరేళ్ల క్రితం తెలంగాణలో ఎటు చూసినా కటిక చీకటి ఉండేది.. ఇప్పుడు తెలంగాణను నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్ళాం…మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణ ను మరింత డెవలప్ చేస్తామని.. ప్రజలు రాయి ఏంటో రత్నమేదో గుర్తించి ఓటు వేయాలని హుస్నాబాద్ వేదిక (KCR Public Meeting in Husnabad)గా ప్రజలను కోరారు బిఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ (CM KCR) కోరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (2023 Telangana Elections) సమయం దగ్గర పడుతుండడంతో గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. సెంటిమెంట్ గా వస్తున్న హుస్నాబాద్ (Husnabad ) వేదికగా ప్రచారం ప్రారంభించారు. అంతకు ముందు తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. ఆ తరువాత బిఆర్ఎస్ మేనిఫెస్టో (BRS Manifesto 2023) ను విడుదల చేసారు. అనంతరం హైదరాబాద్ నుండి హుస్నాబాద్ కు బయలుదేరారు. హుస్నాబాద్ నియోజకవర్గం వేదికగా సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్నిపూరించారు. ఎన్నికల తొలి బహిరంగ సభలో మీ ఆశీర్వాదం కోరడానికి హుస్నాబాద్ వచ్చానని కేసీఆర్ తెలిపారు.
విపక్ష పార్టీలపై విమర్శలు చేస్తూనే.. తమ ప్రభుత్వం చేస్తున్న, చేయబోతున్న పనులను వివరించారు. ఇంకా పనులు చేయాలంటే తమను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 14 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు. దేశంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలబెట్టామన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని, విద్యుత్ ఉత్పత్తి, తాగు, సాగు నీటి సౌకర్యం కల్పనలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. పారిశ్రామిక విధానంలో తెలంగాణకు పోటీయే లేదన్నారు కేసీఆర్.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి. ఎమ్మెల్యే సతీశ్ బాబు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు. బ్రహ్మాండంగా మీ సేవ కోసం పని చేస్తున్నారు. 60 వేల భారీ మెజార్టీతో గెలుస్తారని విశ్వాసం ఉంది. హుస్నాబాద్ గెలుపు.. 95 నుంచి 100 సీట్లు గెలిచచేందుకు నాంది కావాలి అని అన్నారు. 2018లో శాసనసభ ఎన్నికల మొదటి సభలో నేను ఇక్కడికే వచ్చి ప్రసంగించడం జరిగింది. హుస్నాబాద్ గడ్డ ఆశీర్వాదంతో ఆనాడు 88 సీట్లతో అఖండమైన విజయాన్ని సాధించాం. ఈ సారి కూడా ఇక్కడి నుంచే జైత్రయాత్ర ప్రారంభించాలని పెద్దలు చెప్పారు. హైదరాబాద్‌లో అభ్యర్థులకు బీఫారాలు అందజేసి, అక్కడి నుంచి మేనిఫెస్టో ప్రకటించి నేను మీ దర్శనానికి వచ్చాను. ఈ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కోరుతున్నా. నేను చెప్పే మాటలు విని విడిచిపెట్టి వెళ్లొద్దు. పట్టణంలో బస్తీలో, గ్రామానికో, తండానికో పోయిన తర్వాత కేసీఆర్ నాలుగు మాటలు చెప్పిండు.. ఇందులో నిజమేంత అని ఆలోచించాలి’ అన్నారు.
తొమిదిన్నరేళ్ల క్రితం తెలంగాణలో ఎటు చూసినా కటిక చీకటి ఉండేదని, ఇప్పుడు తెలంగాణను నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లామని చెప్పారు సీఎం. వీటన్నింటినీ పరిశీలించి ప్రజలు ఓటు వేయాలని కోరారు కేసీఆర్. రాయి ఏంటో రత్నమేదో గుర్తించి ఓటు వేయాలన్నారు. స్పష్టమైన అవగాహనతో ఓటు వేస్తేనే ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు.
Read Also : Afghanistan Win: వరల్డ్‌కప్‌లో సంచలనం.. ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన ఆప్ఘనిస్తాన్