బిఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ (CM KCR) ఎన్నికల ప్రచారం (Election Campaign )లో భాగంగా నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజా ఆశీర్వాద సభ (BRS Praja Ashirvada Sabha)లో పాల్గొన్నారు. ముందుగా సత్తుపల్లి (Sathupalli) నియోజకవర్గ సభలో పాల్గొని , అనంతరం ఇల్లందు (Yellandu ) నియోజకవర్గం సభలో పాల్గొన్నారు. ఈ రెండు సభలో కేసీఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ ఫై నిప్పులు చెరిగారు.
We’re now on WhatsApp. Click to Join.
‘ ‘ధరణి (Dharani) తీసివేస్తమని రాహుల్ గాంధీ (Rahul Gandhi) అంటున్నాడు. అసలు రాహుల్ గాంధీకి ఎద్దు ఎరుకనా.. ఎవుసరం ఎరుకనా? ఎన్నడన్న నాగలి పట్టిండా? రైతుల బాధలు తెలుసా? ఇక్కడ ఎవడో సన్నాసి రాసిస్తే తెల్వక అజ్ఞానంతో మాట్లాడుతున్నడు. ధరణి బంద్ అయితే.. దానికి ప్రత్యామ్నాయం ఏం వస్తుంది? మళ్లీ వీఆర్వోలేనా ? మళ్లీ పహాణీ నకల్లేనా? మళ్లీ ఎమ్మార్వో కార్యాలయం.. వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుడేనా? అన్న నా పేరు ఎక్కియ్యంటే.. మళ్లీ లావ్ పాంచ్ హజార్ అంటారు. మళ్లీ అదే రావాలా? మీ అధికారం ఉండాలా? మీ అధికారాన్ని తీసివేసుకుంటారా..? అంటూ ప్రశ్నించారు. ‘మీ ఓటు అంటే మామూలు విషయం కాదు. మళ్లీ కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీ దళారీల రాజ్యం వస్తుందని’ హెచ్చరించారు.
మీలో ఒకడిగా, కొట్లాడి తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా చెబుతున్నాను.. అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ ఏదీ..? చరిత్ర ఏందీ..? దృక్పథం ఏంది..? ప్రజల గురించి ఏం ఆలోచిస్తుంది ఆ పార్టీ అని తెలుసుకోవాలని కేసీఆర్ సూచించారు. ఎమ్మెల్యేల ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడతుంది. మంచి ప్రభుత్వం గెలిస్తే మంచి పనులు జరుగుతాయి. చెడు ప్రభుత్వం గెలిస్తే చెడ్డ పనులు జరుగుతాయని అన్నారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు. స్థిరంగా ఆలోచించాలి. ఏం చేస్తే లాభం జరుగుతదో ఆ దారి పట్టాలి. అదే ప్రజాస్వామ్యానికి దారి. ఓటును అలవోకగా వేయొద్దు. తమాషా కోసం వేయొద్దు. కారణం ఏందంటే ఈ దేశంలో ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటు. మీ తలరాత మార్చేది.. భవిష్యత్‌ను తీర్చిదిద్దేది మీ ఓటే ‘ అని వివరంగా చెప్పుకొచ్చారు.
Read Also : AP : ఇంకా ఎన్నాలు ఈ డోలిమోతలు..మమ్మల్ని పట్టించుకునే నాధుడే లేడా..?