తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన కేసీఆర్ ప్రస్తుత రాజకీయ అంశాలపై స్పందించిన కేసీఆర్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కేసీఆర్ స్పీచ్ లోని ప్రధాన పాయింట్లు ఇవే..
1. నరేంద్రమోదీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మోదీ ఎక్కువగా అబద్దాలే చెబుతారు. కేంద్రం తేనున్న విద్యుత్ సవరణ బిల్లు మెడమీద కత్తి లాంటిది. బిల్లు పాస్ అవ్వకముందే ఇంప్లిమెంట్ చేయాలని కేంద్రం ఒత్తిడి తెస్తోంది.ఇది రాజ్యాంగ వ్యతిరేకం. తెలంగాణ రైతుల కోసం నా ప్రాణం పోయినా కేంద్రం చెప్పినట్టు కొత్త మీటర్లు పెట్టడానికి ఒప్పుకోను. విద్యుత్ విషయంలో కేంద్రానిది బ్యాడ్ పాలసీ.
2. బండి సంజయ్ వల్ల ఆ పార్టీ పరువు పోతుంది. ఆయనకు చదువు రాదు. చదివిన అర్ధం కాదు. పాపం బండిసంజయ్ ఏం మాట్లాడుతాడో? ఎందుకు మాట్లాడుతాడో ఆయనకు తెలుసో లేదో? సంజయ్ మాట్లాడే మాటలు చూస్తే ఆయనపై జాలి కలుగుతుంది. మోదీ ప్రధాని కదా ఏమైనా ఫండ్స్ ఇస్తాడని మిషన్ భగీరథ ప్రారంభానికి పిలిస్తే ఆ సభలో కూడా అబద్దాలే మాట్లాడాడు. బీజేపీ ఉంటే దేశం ఉండదు రాసిపెట్టుకోండి. బీజేపీ పరిపాలన, అబద్దాలు చూస్తే దుఃఖం వస్తోంది.
3. సీనియర్ రాజకీయ నాయకుడిగా చెబుతున్నా బీజేపీని తరిమికొట్టకపోతే దేశం నాశనం అవుద్ది. కిషన్ రెడ్డి నాకు మంచి మిత్రుడే కానీ ఆయన కూడా
అబద్దాలు మాట్లాడుతున్నాడు. బడ్జెట్ లో ఏమిలేకపోగా నాకు బడ్జెట్ సరిగా అర్ధం కాలేదని మాట్లాడాడు. బీజేపీది తుపాకీ రాముడి ప్రగతి. దేశాన్ని నడిపే పద్దతి మాత్రం ఇది కాదు. బీజేపీ నాయకులు అన్ని ప్రభుత్వ సంస్థలు అమ్మేస్తూ ప్రజలను గోల్ మాల్ చేస్తోంది. విద్యుత్ సంస్కరణల వల్ల విద్యుత్ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ రంగానికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
4. కేంద్రం తప్పులు చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వానికి అర్ధం కావట్లేదని కిషన్ రెడ్డి అంటున్నాడు. రాష్ట్రం నుండి ఉన్న ఏకైక కేంద్ర మంత్రి కాబట్టి ఆయనకు మర్యాదగా చెప్తున్నాం. ఇంకోసారి కిషన్ రెడ్డి ఇష్టమున్నట్టు మాట్లాడితే సమాధానం వేరేలాగా చెప్పాల్సి వస్తుంది. బీజేపీ పాలనలో దేశమంత
అవినీతి కంపుగా మారింది. మోదీ వచ్చాక అన్ని రంగాల్లో అభివృద్ధి దిగజారుతోంది. బీజేపీ వల్ల ఇండియా పరువుపోతోంది.
5. బీజేపీ పాలనలో 33 మంది ఆర్థికనేరగాళ్ళు దేశం నుండి పారిపోయారు. వీళ్ళందరూ మోదీ దోస్తులే. ముఖ్యంగా గుజరాత్ వాళ్లే. ఇదేనా బీజేపీ దేశభక్తి.
నల్లధనం తెచ్చి 15 లక్షలు ఇస్తానన్న మోదీ ఉన్నవన్నీ కార్పొరేట్లకు కట్టబెడుతున్నాడు. ఇందుకే బీజేపీని గద్దెదించాలని అంటున్నాను.
6. నన్ను జైలుకు పంపుతానని అంటున్న బీజేపీ నేతలు దమ్ముంటే జైలుకు పంపాలి. నన్ను జైలుకు పంపడం కాదు బీజేపీ వాళ్ళని నేను జైలుకు పంపుతా. పక్కనున్న ఇండోనేషియా దేశం రఫెల్ విమానాల్ని తక్కువ ధరకు కొన్నారు. రాహుల్ గాంధీ దీనిపై మాట్లాడితే సైన్యంపై విమర్శలా అని ప్రజలను గోల్ మాల్ చేస్తున్నారు. బీజేపీ అబద్దాలపై ఢిల్లీలో లొల్లి పెడతాను.
7. వాజ్ పేయ్ ఉన్నప్పుడు బీజేపీని కొంత వరకు నమ్మేవాళ్ళు అప్పుడు కొంచెం సిద్ధాంతం ఉండేది. ఇప్పుడు మాత్రం సిగ్గుతప్పింది. రాష్ట్రాల్లో గెలవకపోయినా అడ్డదారిలో పరిపాలించే పార్టీ బీజేపీ. బీజేపీ ప్రభుత్వాల ఏర్పాటులో జరిగిన అంశాలపై చర్చకు సిద్ధమా? యూపీ ఎన్నికలు జరిగిన తెల్లారే పెట్రోల్ రేట్లు పెరుగుతాయి రాసిపెట్టుకోండి.
8. ప్రధాని అయ్యేముందు దేశాన్ని గోద్రా లాగా చేస్తారా అని ప్రశ్నిస్తే మోదీ ముస్లింలకు క్షమాపణ చెప్పారు. మొన్న నల్లచట్టాలను తెచ్చి రైతులకు క్షమాపణ చెప్పారు. అమెరికా ఎన్నికలతో ఇండియాకి ఏం సంబంధం? అమెరికా వెళ్లి ట్రంప్ కు అనుకూలంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? ఇది బీజేపీ చేసిన పెద్ద తప్పు.
9. మోదీని విమర్శించే వాళ్లపై అర్బన్ నక్సలైట్ అనే ముద్రలు వేస్తున్నారు. దేవుని పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేస్తూ మనుషుల మధ్య విద్వేషం పెంచే పనులు చేస్తున్నారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసింది, అలాంటి కుటుంబంపై అంత నీచపు మాటలు మాట్లాడుతారా? ఈ విషయాన్ని నేను వదిలిపెట్టను. అలా మాట్లాడడాన్ని బీజేపీ సమర్ధిస్తుందా? ఇదే భారతీయ సంస్కతా? కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటానని బీజేపీ అనుకుంటుంది. ఎవరితో పొత్తు లేకుండా రెండుసార్లు అత్యధిక మెజార్టీతో గెలిచిన పార్టీకి పొత్తులు ఏం అవసరం.
10. దళిత సంఘాలకు రాజ్యాంగానికి ఏం అవసరం? అంబేద్కర్ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మహిళలకు ఆస్థి హక్కు కోసం, కేంద్ర రాష్ట్ర సంబంధాల సమస్యల పరిష్కారం కోసం, దళిత రిజర్వేషన్ 19 శాతానికి పెరగాలని, బీసీ కులగణన కావాలని కొత్త రాజ్యాంగం అవసరమన్నాను. ఇప్పటికీ ఇదే స్టాండ్ పై ఉన్నాను. పాలించేవాడు బాగలేకపోతే రాజ్యాంగానికి ఇబ్బందులు వస్తాయని అంబేద్కర్ అన్నాడు. అదే నేను చెప్పిన.
11. తెలంగాణ బీజేపీ కోసం నేను వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. దేశంకోసం, దేశప్రజల కోసం మాట్లాడుతున్నాను. బీజేపీ మాకు ప్రతిపక్షం కాదు. నలుగురు ఎమ్మెల్యేలు లేని పార్టీ మాకు ఎలా ప్రతిపక్షం అవుతుంది? హిజాబ్ సమస్య దేశమంతా పాకితే దేశ పరిస్థితి ఎలా మారుతుందోనని భయం అవుతోంది.
12. నేను కాంగ్రెస్ ని సపోర్ట్ చెయ్యట్లేదు. రాహుల్ గాంధీపై వ్యాఖ్యలని ఖండిస్తున్నాను. నేను బహిరంగ సభల్లో మాట్లాడిన అంశాలపై పలు రాష్ట్రాల సీఎంలు కాల్ చేసి చర్చిస్తున్నారు. దేశ ప్రజల కోసం కొత్త పార్టీ పెట్టాల్సివస్తే తప్పకుండ పెడుతాం. సర్జికల్ స్ట్రయిక్స్ విషయంలో సాక్ష్యాలు చెప్పమనడంలో తప్పేముంది? ఇప్పుడు నేను కూడా సాక్ష్యాలు చూపెట్టమని అడుగుతున్నాను. సైన్యం చేసిన విషయాలను కూడా బీజేపీ తమ క్రెడిట్ గా వాడుకుంటుంది ఇది దుర్మార్గం.