KCR New Front:కేసీఆర్ `ఫెడ‌ర‌ల్` దూకుడు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ కూర్పు దిశగా వైపు అడుగులు వేయబోతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీని ఓడించడానికి దేశాన్ని ఏకం చేస్తానని తెల్పిన కేసీఆర్ కేంద్రం పై దూకుడు పెంచాలని నిర్ణయించుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ కూర్పు దిశగా వైపు అడుగులు వేయబోతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీని ఓడించడానికి దేశాన్ని ఏకం చేస్తానని తెల్పిన కేసీఆర్
కేంద్రం పై దూకుడు పెంచాలని నిర్ణయించుకున్నారు. మోదీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో కలిసొచ్చే పార్టీలను కలుపుకొని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.

బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చాలని నినదిస్తోన్న అన్ని శక్తులను కేసీఆర్ తొందరలోనే కలువనున్నారని సమాచారం. బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎవరు ఫైట్ చేసినా వాళ్లకు తమ మద్దతు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పలు రాష్ట్రాలకు సంబందించిన కొందరు నేతలను తాను స్వయంగా కలవనున్నట్లు
సమాచారం.

దేశానికి ప్రత్యామ్నాయం అవసరమని గతంలోనే స్పష్టం చేసిన కేసీఆర్ దానిలో భాగంగా పలు ప్రాంతీయ పార్టీల అధినేతలను కలసి దేశ రాజకీయాల్లో ఒక అడుగు ముందుకు వేశారు. ఆ సమయంలోనే బెంగాల్
సీఎం మమతా బెనర్జీ, ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నయాక్, తమిళ నాడు లో కరుణానిధి తో కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామిని కలిశారు.

తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో భేటీ కావడంతో కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలను స్పీడ్ చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2023లోనే జమిలి ఎన్నికలని వార్తలొస్తున్న నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మళ్లీ థర్డ్ ఫ్రంట్ అంశాన్ని దేశ రాజకీయాల ముందుకు తీసుకుని రావడానికి ప్రయత్నాలు ఆరంభించినట్టేనని లెక్కలు వేసుకుంటున్నారు.
2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి ఆశించిన స్థాయిలో సీట్లు దక్కకపోవడంతో థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలకు కొంత బ్రేక్ పడింది. ఈ సారి మాత్రం వెనక్కి తగ్గకూడదని కేసీఆర్ ఆశిస్తున్నారనే ఆయన సన్నిహితులు అంటున్నారు.

ఎన్డీఏ, యూపీఏ కూటములకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్‌ను తీర్చిదిద్దడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండబోదని కేసీఆర్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తోన్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ దిశగా తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టేనని, దీన్ని మరింత ముమ్మరం చేసేలా కేసీఆర్ పావులు కదుపుతారని చెబుతున్నారు. తటస్థంగా ఉంటూ వస్తోన్న బిజూ జనతాదళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి వంటి నేతలను కూడగట్టుకోవాలని, అప్పుడే థర్డ్‌ఫ్రంట్ సాకారమౌతుందని అంచనాలు ఉన్నాయి. ఇక కేసీఆర్ చెన్నై పర్యటన తర్వాత రాజకీయాలలో ఎలాంటి చర్చలు జరుగుతాయో వేచి చూడాలి.