రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన తల్లి మంజులమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ మంజులమ్మ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. శోకతప్తులైన కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం చెప్పారు. ఇక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఓద్చారారు. ఆమెతో పాటు పలువురు మంత్రి తల్లికి నివాళులు అర్పించారు.
తండ్రి వేముల సురేందర్ రెడ్డి కూడా ఆనారోగ్యంతో ఏడేళ్ల క్రితం మరణించారు. అప్పటి నుంచి తల్లి మంజుల మానసికంగా కృంగి పోయింది. ఆనారోగ్యం పాలైంది. గతంలో బ్రేయిన్ ట్యూమర్ సర్జరీ జరిగింది. దీంతో అప్పట్నుంచి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంది. రెండు నెలలుగా హైదరాబాద్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు.. అయితే పరిస్థితి విషమించి హాస్పటల్ లోనే గురువారం మృతి చెందారు. వేముల ప్రశాంత్ రెడ్డి కి తల్లి మృతి చెందటంతో బాల్కొండ నియోజక వర్గంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Also read: Gangula Kamalakar: కాంగ్రెస్ కు ఓటేస్తే ఆంద్రోళ్లను తరిమికొడతాం- మంత్రి గంగుల సంచలన వ్యాఖ్యలు