ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో ముస్లిం సహోదరులు పవిత్ర మాసంగా జరుపుకునే రంజాన్ (Ramdan) నెల చివరి రోజు ‘ఈద్ ఉల్ ఫితర్’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ముస్లింలకు సీఎం కేసీఆర్ (CM KCR) శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ఆహ్వానం మేరకు నివాసంలో ‘ఈద్ ఉల్ ఫితర్’ వేడుకల్లో పాల్గొన్నారు.
శనివారం మధ్యాహ్నం తమ నివాసానికి చేరుకున్న సీఎంకు మహమూద్ అలీ వారి కుటుంబ సభ్యులు, సీఎం గారిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతంపలికారు. ఈ సందర్భంగా సీఎం ‘ఈద్ ఉల్ ఫితర్’ శుభాకాంక్షలు (Greetings) తెలిపారు. క్షమాగుణం, కరుణ ప్రేమ తదితర ఆధ్యాత్మిక భావనల గురించిన అంశాలపై రంజాన్ పండుగ ప్రాశస్త్యం గురించి సీఎం స్మరించుకున్నారు. ఇవే అంశాలపై తన వెంట వచ్చిన మంత్రులు ప్రజాప్రతినిధులు ముస్లిం పెద్దలతో సీఎం కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్నారు.
ఈ సందర్భంగా తనను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియచేయాడానికి వచ్చిన పలువురు మత పెద్దలు, సామాన్యులను పేరు పేరునా పలకరించి, అలాయ్ బలాయ్ తీసుకుని వారికి సీఎం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యమకాలం నుంచీ నేటి వరకు తనతో కొనసాగుతున్న సీనియర్ కార్యకర్త శ్రీ సత్తార్ గుల్షనీ ని పేరు పెట్టి పిలిచి దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు (CM KCR).
Also Read: Baahubali 3: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బాహుబలి మళ్లీ వచ్చేస్తున్నాడు, అప్డేట్ ఇదిగో!