Site icon HashtagU Telugu

Telangana : జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌

Telangana Jathiya Samaikyatha Dinotsavam

Telangana Jathiya Samaikyatha Dinotsavam

ప్రతీ ఏడాది సెప్టెంబర్ 17ని తెలంగాణ ప్రభుత్వం (Telangana Government).. తెలంగాణ విలీన దినోత్సవం (Telangana Liberation Day)గా జరుపుతోంది. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమంటూ… తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని పట్టుబడుతుండటంతో.. ఈసారి పేరు మార్చిన తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవం(Telangana Jathiya Samaikyatha Dinotsavam)గా జరుపుతోంది. ఈ కార్యక్రమం బీఆర్ఎస్ తరపున కాకుండా… ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తోంది. ఉదయం నుండి కూడా అన్ని జిల్లాల్లో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు జరుపుతుంది.

నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగిన జాతీయ సమైక్యతా దినోత్సవ (Telangana Jathiya Samaikyatha Dinotsavam) వేడుకల్లో సీఎం కేసీఆర్‌ (CM KCR)పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొనేందుకు పబ్లిక్‌ గార్డెన్స్‌ వచ్చిన ముఖ్యమంత్రికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సీఎం జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు గన్‌పార్కులో అమరవీరులకు సీఎం ఘనంగా నివాళులు అర్పించారు. పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట ఎంపీ సంతోష్‌ కుమార్‌, సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ తదితరులు ఉన్నారు.

అలాగే తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దండే విఠల్, తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, బోగరపు దయానంద్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతం భారత్‌లో విలీనమైంది. ఈ సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాలతో సహా ప్రభుత్వ కార్యక్రమాల్లో జాతీయ సమైక్యత వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. గత ఏడాది కూడా తెలంగాణ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మూడు రోజుల పాటు ర్యాలీలు నిర్వహించడంతో పాటు వాడవాడలా జాతీయ జెండాలను ఎగురవేశారు.